/rtv/media/media_files/2024/12/15/7cjYrVHamMmfF4grUqqU.jpg)
సిరియా నుంచి పారిపోయిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఒక నియంత, క్రూరుడు అని తెలుస్తోంది. ఇతని పాలనలో సిరియా ప్రజలు నరకాలు అనుభవించారు. దానికి ఫలితమే తిరుగుబాటు. దాని తరువాత నుంచి అతని పైశాచిక మనస్తత్వం, పలన గురించి కథనాలు బయటకు వస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళకు నరకాన్ని చూపించేవాడు అసద్. తిరుగుబాటు దారుల కోసం స్నైదాయ మిలటరీ జైలు ఏర్పాటు కూడా చేశాడు. అక్కడితో ఆగిపోకుండా అందులోకి బందీలుగా వచ్చినవారిని నానా బాధలు పెట్టేవారని తెలుస్తోంది. వికృత చర్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. అసద్ ఇంటెలిజెన్స్ విభాగంలోని కీలక అధికారి ప్రవర్తనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
మనుషులే సింహాలకు ఆహారం..
అసద్ సింహాలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవాడు. వాటికి ఆహారం జంతువులను కాకుండా మనుషులును వేసేవాడు. అది కూడా స్నైదాయలో ఉన్న ఖైదీలను వాటికి ఆహారంగా తినిపించేవాడని చెబుతున్నారు. అసద్ టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్‌లో కీలక అధికారి తలాల్ దక్కాక్ ఖైదీలను తీసుకెళ్ళి సింహాలకు ఆహారంగా వేసేవాడట. తనకు ఎదురు తిరిగిన వారందరికీ ఇదే శిక్ష. అసలు ఆ సింహాన్ని తీసుకొచ్చింది కూడా దక్కకే. ఇతను చేసిన అరాచకాలకు లెక్కే లేదు అని చెబుతున్నారు. బలవంతపు వసూళ్లు, హత్యలు, కిడ్నాప్‌లు, అవయవ అక్రమ రవాణా లాంటి వికృత చర్యలకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఇతని ఆధీనంలో 1500 మంది పనిచేసేవారు అధయక్షుడు అసద్ అండదండలతో దక్కక్ పైకి ఎదగడమే కాకుండా.. సొంతంగా తనకంటూ నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడని తెలుస్తోంది. తాజాగా తిరుగుబాటు దారులు సిరియాను హస్తగతం చేసుకున్న తర్వాత దక్కాక్‌ను సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీశారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.