Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు పొందుపరిచారు. కానీ తాజాగా ఇప్పుడా బిల్లులను జాబితా నుంచి తొలగించారు. దీంతో ఈ బిల్లులపై సందిగ్ధత నెలకొంది.

New Update
ONE nation One election

జమిలి ఎన్నికల బిల్లు అంశం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం నడుస్తోంది. అయితే తాజగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ముందుగా డిసెంబర్ 16న లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్రమంత్రి అర్జు్న్‌రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం చెప్పింది. 

Also Read: బెంగళూరు టెకీ కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్టు

కానీ తాజాగా లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులు తొలగించారు. ఇప్పుడా ఈ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు లేదు. దీంతో ఈ బిల్లు ఈసారి ప్రవేశపెట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డిసెంబర్ 20న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. దీంతో జమిలి ఎన్నికల బిల్లుపై సందిగ్దత నెలకొనడం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

Jamili Elections

ఇదిలాఉండగా.. జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలోని కొత్తగా 82ఏ ఆర్టికల్ చేర్చాల్సి ఉంటుంది. అలాగే పార్లమెంటు పదవీకాలంలో మార్పుల కోసం ఆర్టికల్ 83, అసెంబ్లీ పదవీకాలం సవరణ కోసం ఆర్టికల్ 172, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం ఇచ్చే ఆర్టికల్ 327ని సవరించాల్సిన అవసరం ఉంది. 

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఒకవేళ జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే లోక్‌సభ, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని కేంద్ర కేబినేట్‌ పక్కనపెట్టింది. కేవలం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. 

Also Read: రైతులకు గుడ్‌ న్యూస్..తాకట్టు లేకుండా 2లక్షల రుణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు