సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు నాటుకోడి చికెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న విందులో నాటుకోడి చికెన్ వడ్డించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఆ చికెన్ తాను తినలేదని ఆయన తెలిపారు.

New Update
cm,

కోడి వివాదం కొట్లాట వరకు వెళ్తుందట. అలాంటిదే తాజాగా జరిగింది. అయితే అది కొట్లాట వరకు వెళ్లలేదు కానీ.. ఒక సీఎం పై వివాదం తలెత్తేలా చేసింది. ఏంటీ.. కోడి వివాదంతో సీఎంకి తలనొప్పిగా మారడమేంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. అందుకు కారణం.. చికెన్‌తో వడ్డించిన విందులో సీఎం పాల్గొనడమే. ఇంతకీ ఏం జరిగింది. విందులో పాల్గొంటే సీఎంపై ఎందుకు విరుచుకు పడుతున్నారు. ఆ సీఎం ఎవరు అనే విషయానికొస్తే.. 

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తరచూ ఆయన్ను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో మరో వివాదంలో సీఎం సుఖ్విందర్ చిక్కుకున్నారు. అది చికెన్ వివాదం కావడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది. 

ఏం జరిగిందంటే?

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సుఖ్విందర్ సింగ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విందు ఏర్పాటు చేయగా.. అందులో సీఎం సుఖ్విందర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆ విందులో నాటుకోడి చికెన్‌ను వడ్డించారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

Also Read: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

ఆ వీడియో ప్రకారం.. విందులో నాటుకోడి చికెన్‌ను సీఎం సుఖ్విందర్ తినకపోయినప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సహా మిగతావారు తిన్నారు. దీంతో ఆ వీడియో వైరల్ కావడంతో జంతు సంరక్షణ సంస్థ దానిని తప్పుబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం.. నాటుకోడిని వేటాడటం చట్టపరంగా నేరం. రక్షించాల్సిన జాతుల లిస్ట్‌లో నాటుకోడి కూడా ఉంది.

 

దీంతో ఆ విందులో పాల్గొన్న సీఎంతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాటుకోడి వ్యవహారంపై సీఎం సుఖ్విందర్ స్పందించారు. ఆ విందులో నాటుకోడి చికెన్‌ను వడ్డించిన విషయం నిజమేనని.. అయితే తాను దాన్ని తినలేదని చెప్పారు. అయితే కొన్ని మీడియా ఛానెళ్లు మాత్రం తాను ఆ చికెన్ తిన్నట్లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు