/rtv/media/media_files/2025/08/10/ec-2025-08-10-20-08-39.jpg)
No name will be deleted without notice, says Election Commission on Bihar SIR
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR)పై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంపై సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల లిస్టు నుంచి ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలను ఖండించింది. అర్హత ఉండే ఏ ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించమని స్పష్టం చేసింది.
Also Read: ఎన్నికల సంఘంపై యుద్ధం.. మరో సంచలన డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ
ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఓటరు పేరును తొలగించే విధానం ఓ రూల్ ప్రకారం జరుగుతుందని చెప్పింది. పేరును తొలగించడం, దీనికి సంబంధించిన కారణాలు ముందుగానే ఓటరుగా తెలియజేస్తామని చెప్పింది. ప్రతి ఓటర్‌కు కూడా వారి వాదనలు వినిపించేందుకు, సంబంధిచ పత్రాలు సమర్పించేందుకు ఛాన్స్ ఇస్తామని పేర్కొంది. అంతేకాదు SIR మొదటి దశ పూర్తయ్యిందని.. ఈ తొలిదశలో దాదాపు 7.24 కోట్ల మంది ఓటర్లు వారికి సంబంధించిన పత్రాలు సమర్పించారని తెలిపింది. వీటన్నింటినీ సవరించిన లిస్టులో చేర్చనున్నట్లు వెల్లడించింది.
Also read: ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు కొత్త రూపు రేఖలు... సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు..
అలాగే ఆయా పేర్లు డిజిటలైజ్ చేశామని.. తొలగించిన ఓటర్ల లిస్టును ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు అందజేయనున్నట్లు పేర్కొంది. SIR మొదటి దశను బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌తో సహా 38 జిల్లాల ఎలక్షన్ అధికారులు, 243 మంది EROలు, 27976 మంది AEROలు, 77,895 మంది BLOలు తదితరులు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపింది. అంతేకాదు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఎవరైనా కూడా ఓటరు జాబితాలో సవరణల కోసం ఫిర్యాదులు చేయొచ్చని, అభ్యంతరాలు కూడా చెప్పొచ్చని తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది .
Also Read: తీసుకున్న గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం
పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తే తాము జోక్యం చేసుకుంటామని తెలిపింది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీలను చెల్లుబాటయ్యే పత్రాలుగా పరిగణించాలని ఈసీకి సూచనలు చేసింది. పేర్లను తొలగించే బదులు చేర్చే ప్రక్రియపై ఫోకస్ పెట్టాలని చెప్పింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారాన్ని ఆగస్టు 9 నాటికి సమర్పించాలని ఆదేశించింది. దీన్ని రాజకీయ పార్టీలకు సైతం అందించాలని పేర్కొంది. ఇదిలాఉండగా ఈ ఏడాది నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Also read: ట్రంప్‌పై నటి సంచలన ఆరోపణలు.. ‘విడాకులు తీసుకున్న రోజే డేట్‌కు పిలిచాడు’