రాజ్యాంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న జంట.. ఎక్కడంటే ?

ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Couple Oath on Constitution

Couple Oath on Constitution

ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ పెళ్లి జరిగింది. తరతరాలు వస్తున్న ఆచారాలు, సంప్రదయాలను పక్కన పెట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఓ జంట వివాహం చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, అమ్మాయి మెడలో తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి ఆచారను కూడా వాళ్లు పాటించలేదు. కేవలం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. 

Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్‌.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు

సాధారణంగా పెళ్లికి అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం ఎలాంటి అనవసర ఖర్చులు కూడా చేయకుండానే సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇలా పెళ్లి చేసుకోవడంపై పెళ్లి కొడుకు ఇమాన్ లాహ్రె కూడా స్పందించారు. వివాహ కార్యక్రమానికి పెట్టే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలా చేసినట్లు తెలిపారు. తమకు ఆచారాలు, సంప్రదాయల కన్నా రాజ్యాంగం మీదే ఎక్కువగా నమ్మకం ఉందని పేర్కొన్నారు. 

Also Read: ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా!

డిసెంబర్ 18న ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లా కాపు గ్రామంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అందరిలా కాకుండా ఇలా కొత్తగా, రాజ్యాంగంపై ప్రమాణం చేసి సింపుల్‌గా పెళ్లి చేసుకోవడంపై..ఈ జంట బంధువులు, గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి పెళ్లి చేసుకున్న ఆ జంట ఆలోచనా విధానాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.ఎక్కువ ఖర్చు చేయకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నందుకు ప్రశంసిస్తున్నారు. 

Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్!

Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు