TG News: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీ తేజ్‌ను చూస్తే భయమేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన శ్రీ తేజ్‌ను చూసి ఎమోషనల్ అయ్యారు. బాధితుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున రూ. 25లక్షల చెక్ అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 'డాక్టర్ లతో నేను చర్చించాను. నేను 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి చుస్తే నాకే భయం వేస్తుంది. పూర్తిగా కోలుకోవడానికి 1,2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కోలుకున్నా మాటలు వస్తాయో రావో తెలియదు' అంటూ ఎమోషనల్ అయ్యారు.
పుష్ప 2 సినిమా చూసాను.. నా మూడున్నర గంటల టైం వేస్ట్ అయింది
— RTV (@RTVnewsnetwork) December 21, 2024
ఈ లోపు 10 ఊర్లు తిరిగేవాడిని
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.@KomatireddyKVR @alluarjun #AlluArjun #Pushpa2 #RTV pic.twitter.com/NxzFSylazy
ఇదేమైన దేశభక్తి సినిమానా..
అలాగే ఇకపై తెలంగాణలో బెన్ ఫిట్ షోస్ ఉండవని చెప్పారు. అవేమైన దేశ భక్తికి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాల విషయం వేరు. పుష్ప 2 నేను కూడా చూశాను. ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాను తప్పా తెలుగు సినిమాలు చూడను. మూడు గంటల సినిమా సమయంలో చాల పనులు చేసుకోవచ్చు. మేము కూడా క్షమాపణ చెప్తున్నాం. సినిమాలతో యువత చెడిపోతుంది. ఇకపై తెలంగాణలో నో బెన్ఫిట్ షోస్. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దు. షోలు చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దు. ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావొద్దు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. అందరూ హీరోలు, ప్రొడ్యూసర్స్ కోపరెట్ చేయాలని సూచించారు.