ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా!

1923 కంటే ముందు శాంటా క్లాజ్‌కు ఓ రూపం లేదని మీకు తెలుసా? ఆయన పుర్రె ఆధారంగా శాంటా క్లాస్ రియల్ ఫేస్ కనిపెట్టారట శాస్త్రవేత్తలు. మరి శాంతా తాతను ఎలా సెట్ చేశారు? రియల్ శాంటా క్లాస్ ఎలా ఉంటాడు? ఇట్రెస్టింగ్ స్టోరీ కోసం ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. 

author-image
By srinivas
New Update
Santa Class

శాంటా క్లాస్

Santa Class: శాంటా క్లాస్.. ఈ పేరు గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. కానీ, ఇప్పుడు అందరూ చూస్తున్న శాంటా క్లాస్ గెట్‌అప్ కాపీ రైట్స్ కోకాకోలా కంపెనీవి అని మీకు తెలుసా..? క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైంలో ఎక్కువగా మనకు కనిపించేది శాంటా క్లాస్ గెట్‌అప్. 1923 కంటే ముందు శాంటా క్లాజ్‌కు ఓ రూపం లేదు. కానీ తర్వాత శాంటా క్లాస్ ఎలా ఉంటాడంటే ఎవ్వరైనా చెప్పగలుగుతున్నారు. మరి 1923లో ఏం జరిగింది.? ఆ శాంటా క్లాస్ వేషధరణకు, కోకాకోలా కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి? 1700 సంవత్సరాల తర్వాత శాంటా క్లాస్ రియల్ ఫేస్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఓ రెడ్ కలర్ కోటు, తలకు పొడవాటి టోపి, గుబురు గడ్డం, చేతిలో కర్ర పెట్టుకొని ఉండడు. మరి ఇవన్ని శాంతా తాతకు ఎవరు సెట్ చేశారు. రియల్ శాంటా క్లాస్ ఎలా ఉంటాడు తెలుసుకునేందుకు ఇది పూర్తిగా చదివేయండి. 

రియల్ నేమ్ సెయింట్ నికోలస్..

అసలు శాంటా క్లాస్ రియల్ నేమ్ సెయింట్ నికోలస్. అతను మరణించిన 1700 సంవత్సరాల తర్వాత పరిశోధకులు ఆయన పుర్రెపై రీసెర్చ్ చేశారు. అప్పటికీ ఆయన రూపం ఎవ్వరికీ తెలియదు. క్రైస్తవమతం ప్రారంభంలో ప్రాచీన గ్రీక్ దేశం లైసియా నగరంలోని మైరా అనే ప్రాంతానికి చెందినవాడు ఈ సెయింట్ నికోలస్. క్రైస్తవ బిషప్ అయిన సెయింట్ ఛారిటబుల్ సేవలు చేస్తూ, ప్రజలకు బహుమతులు ఇస్తుండేవాడు. క్రైస్తవమత వ్యాప్తికి సెయింట్ నికోలస్ అనేక చర్యలు చేపట్టాడు. అతని దయతో డచ్ ఫిగర్ ఆఫ్ సింటర్‌క్లాస్‌కు పునాది పడింది. అదే తర్వాతి రోజుల్లో ఇంగ్లీస్ ఫాదర్ క్రిస్మస్‌లో కలిసిపోయింది. ఈ మత సంస్థలు సెయింట్ నికోలస్‌ (ప్రస్తుత శాంటా క్లాస్‌ను) దేవుడిగా ప్రార్థించేవారు. కానీ.. ఇప్పుడున్న రూపంలో కాదు. అప్పడు శాంటా క్లాస్ రూపం ఎవరికీ తెలియదు. బిషప్ దుస్తులు, జంతు చర్మాన్ని ధరించి ఉండేవాడని చెప్పుకునే వారు. పేరును మాత్రమే కొలిచేవారు.

నికోలస్ పుర్రె ఆధారంగా..

ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతులను ఉపయోగించి ఇప్పుడు శాంటా క్లాస్, ఒకప్పుటి సెయింట్ నికోలస్ రియల్ ఫేస్‌ను శాస్త్రవేత్తలు మొదటిసారిగా వెల్లడించారు. అతను మరణించి దాదాపు 1700 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. 1950లో సెయింట్ నికోలస్ పుర్రె ఆధారంగా ఆయన 3D ఫేస్ గీశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం. లుయిగి మార్టినో అనే పరిశోధకుడు శాంటా క్లాస్ పుర్రెను సేకరించింది. చాలా రోజుల తర్వాత సిసెరో మోరేస్ అనే రీసెర్చర్ శాంటా క్లాస్ చిత్రం రూపొందించాడు. 1823లో క్లెమెంట్ క్లాక్ మూర్ రచించిన.. ఎ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే ఫేమస్  పోయిమ్‌లో కూడా శాంతా క్లాస్ ముఖం వర్ణించడానికి ప్రయత్నించాడు. ఎలా ఉంటాడో చెప్తూ పాట రూపంలో పాడారు. తర్వాత 1923లో కంపెనీ యాడ్ కోసం శాంటా క్లాస్‌కు ఓ గెట్‌అప్ రూపొందించింది.

ఇది కూడా చదవండి: టెస్టులకు రోహిత్ గుడ్ బై.. కెప్టెన్‌గా బుమ్రా!

1923లో కోకాకోలా కంపెనీ శాంటాక్లాస్‌కు ఓ రూపం ఇవ్వాలనుకుంది. ఓ కళాకారుడితో శాంటాక్లాస్ డ్రాయింగ్ వేయించింది. కానీ అనుకున్నంత గొప్పగా అది రాలేదు. కంపెనీ అడ్వర్టైజింగ్ అకౌంట్ ఎగ్జిక్యూటీవ్ ఆర్చీలీ శాంటాక్లాస్‌ని అందరికీ ఫ్రెండ్లీగా చూపించాలని అనుకున్నాడు. 1931లో that knows no reason పేరుతో అడ్వర్టైజింగ్ క్యాంపైన్ కోసం ఆర్టిస్ట్ హేడన్ సండ్‌బ్లోమ్‌తో శాంటా క్లాజ్ పెయింటింగ్ వేయించారు. 1822లో క్లెమెంట్ క్లాక్ మూర్ రచించిన ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ కవితకు ఆయిల్ పెయింటింగ్‌తో రూపానిచ్చి సండ్‌బ్లోమ్ సరికొత్త శాంటాను ఆవిష్కరించారు. కోకాకోలా బ్రాండ్ కలర్స్ రెడ్ అండ్ వైట్. ఇందులో శాంటా క్లాజ్ కూడా రెడ్ అండ్ వైట్ దుస్తుల్లోనే కనిపిస్తారు. అదే మనం ఇప్పుడు చూస్తున్న గుబురు గడ్డంతో ఉన్న శాంటా క్లాస్ గెట్‌అప్. సండ్‌బ్లోమ్ వేసిన శాంటా పెయింటింగ్‌ను కోకాకోలా కంపెనీ 1964లో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించింది. 1964లో ది సాటర్‌డే ఈవినింగ్ పోస్ట్, ది లేడీస్ హోమ్ జర్నల్, నేషనల్ జియోగ్రాఫిక్, ది న్యూ యార్కర్ లాంటి ప్రముఖ పబ్లికేషన్స్‌లో కోకాకోలా శాంటా యాడ్ కనిపించింది. అందులో శాంటా కోకాకోలా డ్రింక్ పట్టుకొని ఉంటాడు. అది అందర్ని ఆకర్షించింది. దీంతో అందరూ శాంటా క్లాస్ రియల్ గెట్‌అప్ అనుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు అందరూ చూస్తున్న శాంటా క్లాస్ గెట్‌అప్ కాపీ రైట్స్ కోకాకోలా కంపెనీవే.

#latest-telugu-news #telugu-news #telugu breaking news #today-news-in-telugu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు