Uttarakhand Cloudburst: మరోసారి ఉత్తరాఖండ్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?

మరోసారి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
uttrakhand

uttrakhand

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్లౌడ్ బరస్ట్‌లో ఎందరో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే మరోసారి తాజాగా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

ఇది కూడా  చూడండి: Heavy Rains: కామారెడ్డికు తప్పని గండం.. నేడు కూడా ఈ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు!

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెనలు..

ఉత్తరాఖండ్‌లో అలకనంద, మందాకిని నదుల సంగమంలో నీటి మట్టాలు నిరంతరం పెరుగుతున్నాయి. కేదార్‌నాథ్ లోయలోని లావారా గ్రామంలో, మోటారు రోడ్డుపై ఉన్న వంతెన బలమైన ప్రవాహాలకు కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో సంభవించిన ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు వర్షపు నీరు, బురదతో నిండిపోయాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మోటారు రోడ్డుపై వంతెనలు కొట్టుకునిపోయాయి.  దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఇది కూడా  చూడండి: Heavy Rains: కామారెడ్డికు తప్పని గండం.. నేడు కూడా ఈ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు!

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి, పిథోరగఢ్, బాగేశ్వర్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఉత్తరకాశి, డెహ్రాడూన్, తెహ్రీ గర్హ్వాల్, రుద్రప్రయాగ్, పౌరి గర్హ్వాల్, హరిద్వార్, అల్మోరా, నైనిటాల్‌లకు శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Advertisment
తాజా కథనాలు