/rtv/media/media_files/2025/08/29/sea-drone-2025-08-29-08-48-49.jpg)
నేల మీద యుద్ధం చాల్లేదని ఇప్పుడు నీటిలో కూడా మొదలెట్టింది రష్యా. ఉక్రెయిన్(Russia Ukraine War) నావికాదళం మీద డ్రోన్లను ప్రయోగిస్తోంది. తాజాగా మొట్ట మొదటిసారి సీ డ్రోన్ ను ఉపయోగించి ఉక్రెయిన్ అతి పెద్ద నావికాదళ నౌక సింఫెరో పోల్ ను పేల్చేసింది రష్యా. నావికాదళ నౌక డ్రోన్ దాడి(Sea Drone Attack) లో ఢీకొని మునిగిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. రేడియో, ఎలక్ట్రానిక్, ఆప్టికల్ నిఘా కోసం ఉక్రెయిన్ దీన్ని సముద్రంలో ఉంచింది. పదేళ్ళుగా ఇది సేవలందిస్తోంది. డానుబే నదిలో ఇది ఉంది. నౌక సగ భాగం ఉక్రెయిన్ లోని ఒడెస్సా ప్రాంతంలో ఉందని రష్యా రక్షణశాఖ వివరాలు తెలిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా..చాలా మంది సిబ్బంది గాయపడ్డారని కీవ్ ఇండిపెండెంట్ వార్తలు ప్రచురించింది. ఆగస్టు 2 నజరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
#Russia marine drone takes down a #Ukraine intelligence/reconnaissance ship in the River #Danube
— Devi Rhamesz (@ChrliesWarchest) August 28, 2025
Hurry to the Eyes and Ears doctors before the insurance expires#DPRK#UK#Germany#Francepic.twitter.com/lezgJ7FeCT
Also Read : ఎలుక..ఏనుగును కొట్టినట్టుంది..టారీఫ్ లపై అమెరికా ఆర్థిక వేత్త వ్యాఖ్యలు
2019లో సింఫెరో పోల్ ప్రారంభం..
నౌకపై దాడి జరిగిన తర్వాత చాలా మంది గల్లంతయ్యారు. తమను తాము కాపాడుకోవడానికి వారు నదిలో దూకేశారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. షిప్ లోనే ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. సింఫెరో పోల్ 2019లో ప్రారంభించబడిందని ఉక్రెయిన్ చెబుతోంది. 2021 నుంచి ఇది నావికాదళంలో చేరింది. కీవ్ ప్రయోగించగలిగిన అతి పెద్ద నౌక ఇది. రాత్రి సమయం చూసుకుని రష్యా రెండు పెద్ద క్షిపణి దాడులను చేసిందని ఉక్రెయిన్ నేత ఇగోర్ జింకెవిచ్ తెలిపారు.
కీవ్ పైనా దాడి..
మరోవైపు నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడికి పాల్పడింది. మొత్తం 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 48 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా తాజా దాడుల వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా తీవ్రంగా ఖండించారు. కీవ్ సిటీలో సుమారు 20 ప్రాంతాల్లో రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు 100 భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన వాటిలో 563 డ్రోన్లు, 26 క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది.
Also Read: India-Japan: క్వాడ్, ఏఐ, సెమీ కండక్టర్లపై చర్చ..జపాన్ లో ప్రధాని మోదీ బిజీ బిజీ