IRCTC: రైలు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారా ?.. త్వరలో మారనున్న రూల్స్‌

రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్‌ కార్డు అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది.

New Update
New IRCTC train ticket rules from october 1st

New IRCTC train ticket rules from october 1st

చాలామంది దూర ప్రయాణాలు చేసేందుకు రైలు ప్రయాణాన్ని(Train Journey) ఎంచుకుంటారు. ఇందుకోసం ముందుస్తుగానే టికెట్స్‌ బుక్‌ చేసుకొని రిజర్వేషన్లు చేసుకుంటారు. అయితే తాజాగా రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్‌ కార్డు అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్‌తో వెరిఫై అయిన వినియోగదారులు మాత్రనే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

Also Read: ఆఫీసులో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా

New IRCTC Train Ticket Rules

ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌(train-tatkal-ticket) కు సంబంధించి మాత్రమే ఇది అమల్లో ఉంది. అయితే అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైనా ట్రైన్‌కు 60 రోజుల ముందే టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే తత్కాల్‌ టికెట్ల లాగే బుకింగ్‌ ప్రారంభమయ్యాక వెంటనే పలువురు కేటుగాళ్లు సాఫ్ట్‌వేర్‌ సాయంతో టికెట్లను బుక్ చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. 

Also read: ఈ అనుమానంతోనే లండన్‌లో నిరసనలు.. బ్రిటన్‌ని కదిలించిన ముగ్గురు పిల్లల చావు

అందుకే రిజర్వేషన్‌ టికెట్లు(Reservation Tickets) పక్కదారిన పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేబోర్డు తెలిపింది. దీనివల్ల సామాన్య యుజర్లకు ఆ ప్రయోజనాలు అందిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించి అన్ని జోనల్‌ కార్యాలయాలను సమాచారం అందించింది. అయితే రైల్వేస్టేషన్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌లో టికెట్‌ బుకింగ్ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదు.  

Also Read: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు..భర్త మృతి..భార్య ఏం చేసిందంటే..?

Advertisment
తాజా కథనాలు