/rtv/media/media_files/2025/10/02/ncrb-report-dowry-crimes-saw-an-unprecedented-rise-in-2023-2025-10-02-14-31-08.jpg)
Ncrb Report Dowry Crimes Saw An Unprecedented Rise In 2023
దేశంలో వరకట్న వేధింపులు(dowry) మళ్లీ పెరుగుతున్నాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి. ఈ వేధింపుల కారణంగా 6,156 మంది మహిళలు మృతి చెందారు. అయితే 2021లో చూసుకుంటే వరకట్న నిషేధ చట్టం కింద 13,568 కేసులు నమోదు కాగా.. 2022లో ఈ సంఖ్య 13,479కి తగ్గింది. కానీ 2023లో మాత్రం మళ్లీ కేసులు పెరిగాయి.
Also Read: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!
NCRB Report Dowry Crimes
రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 7,151 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్‌లో 3,665 కేసులు, కర్ణాటకలో 2322 కేసులు నమోదయ్యాయి. మరణాల పరంగా చూస్తే యూపీలోనే అత్యధికంగా 2,122 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత బిహార్‌లో1,143 మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు 2023లో 833 హత్యలు వరకట్న వేధింపుల వల్లే జరిగినట్లు రిపోర్టు పేర్కొంది.
Also Read: లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ
ఇక 2023లో మొత్తం 83,327 వరకట్న సంబంధిత కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్నట్లు NCBR తెలిపింది. వీటిలో 69,434 అంతకుముందు నుంచే పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఆ ఏడాది వరకట్న నేరాలకు సంబంధించి 27,154 మందిని పోలీసులు అరెస్టులు చేశారు. వీళ్లలో 22,316 మంది పురుషులు ఉండగా.. 4,838 మంది మహిళలు ఉన్నారు.
Also Read: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు