PM Modi: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోదీ ఫోన్.. యుద్ధం గురించి ఆరా!

ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం ఫోన్ చేసి, గాజాలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. హమాస్‌తో జరుగుతున్న పోరాటం, బందీల విడుదల, శాంతి ఒప్పందం దిశగా జరుగుతున్న ముందడుగులపై నెతన్యాహు మోదీకి బ్రిఫింగ్ ఇచ్చారు.

New Update
modi phone call

అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కి బుధవారం ఫోన్ చేసి(phone-call), గాజాలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. హమాస్‌తో జరుగుతున్న పోరాటం, బందీల విడుదల, శాంతి ఒప్పందం దిశగా జరుగుతున్న ముందడుగులపై నెతన్యాహు మోదీకి బ్రిఫింగ్ ఇచ్చారు.

ప్రధాని మోదీ ఈ ఫోన్ కాల్ గురించి Xలో షేర్ చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా, ఇతర మధ్యవర్తులు ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో నెతన్యాహు వివరించారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల క్షేమం, వారిని సురక్షితంగా తీసుకురావడంపై తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నెతన్యాహు పంచుకున్నారు. ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని, అదే సమయంలో మానవతా దృక్పథంతో గాజా ప్రజలకు సాయం అందాలని మోదీ పునరుద్ఘాటించారు. - iran-isreal-war

Also Read :  అట్లాంటిక్ లో రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్..ఛేజ్ చేసి పట్టుకున్న అమెరికా దళాలు

PM Modi Spoke To Israeli PM Netanyahu Over The Phone

Also Read :  తనకే దిక్కులేని పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు ఫైటర్ జెట్లు ఇస్తానని ఒప్పందం

యుద్ధంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన నెతన్యాహుకు సూచించారు. "పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తన వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది" అని మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇజ్రాయెల్-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. కేవలం యుద్ధంపైనే కాకుండా, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడుల నేపథ్యంలో, నెతన్యాహు భారత్ వంటి శక్తివంతమైన దేశాల మద్దతు కోరడం గమనార్హం. పశ్చిమ ఆసియాలో స్థిరత్వం అనేది కేవలం ఆ ప్రాంతానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమని భారత్ భావిస్తోంది. అందుకే, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న తాజా సమాచారాన్ని విశ్లేషిస్తూ, శాంతి స్థాపనలో భారత్ తన దౌత్యపరమైన ముద్రను వేయాలని చూస్తోంది.

Advertisment
తాజా కథనాలు