BREAKING: నాగలాండ్ గవర్నర్‌ కన్నుమూత

నాగలాండ్‌ గవర్నర్‌ గణేశన్‌(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.

New Update
Nagaland Governor La Ganesan dies in Chennai at 80

Nagaland Governor La Ganesan dies in Chennai at 80

నాగలాండ్‌ గవర్నర్‌ గణేశన్‌(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 8న గణేశన్.. తన నివాసంలో కుప్పకూలాడు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు. చివరికి శుక్రవారం సాయంత్రం 6.23 PM గంటలకు తుదిశ్వాస విడిచారు. 

Also Read: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..

ఇక వివరాల్లోకి వెళ్తే.. 1945 16న తమిళనాడులో తంజావూరులో గణేశన్ జన్మించారు. చిన్నతనంలో RSS భావాజలంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆ సంస్థతో సంబంధాలున్నాయి. 1970లో ఆరెస్సెస్ ప్రచారక్‌ కర్తగా మారిన గణేశన్.. 20 ఏళ్లు మదురై తదితర ప్రాంతాల్లో సంఘ్‌లో సేవలు అందించారు. అనంతరం 1991లో బీజేపీలో చేరారు. తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచేందుకు ఆయన కృషి చేశారు.అనంతరం జాతీయ స్థాయిలో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.  

Also Read: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్‌ ఇవ్వనున్నారా ?

ఇక మధ్యప్రదేశ్ నుంచి 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో మణిపుర్‌ గవర్న్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరి 19 వరకు అక్కడ కొనసాగారు. అంతేకాదు 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించారు. చివరికి 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్‌ గవర్నర్‌గా కొనసాగుతూ వస్తున్న గణేశన్.. తాజాగా తుదిశ్వాస విడిచారు. 

Also Read: స్వాతంత్ర్య వేడుకలకు అడ్డొచ్చిన ఖలిస్థానీయులు.. భారతీయులతో గొడవ

ఇదిలాఉండగా గవర్నర్‌ గణేశన్ మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసేందుకు గణేశన్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. నిజమైన జాతీయవాదికి ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని రాసుకొచ్చారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారంటూ గుర్తుచేసుకున్నారు. 

Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

Advertisment
తాజా కథనాలు