/rtv/media/media_files/2025/08/15/khalistanis-attempt-to-disrupt-independence-day-celebrations-in-melbourne-2025-08-15-15-32-28.jpg)
Khalistanis attempt to disrupt Independence Day celebrations in Melbourne
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం ఊహించని ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకల నిర్వహణలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమానికి అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్సులేట్ కార్యాయంలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు భారతీయులు అక్కడికి వచ్చారు.
Also Read: ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు
దేశభక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్థానీలు అక్కడికి వచ్చారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారతీయులు, ఖలిస్థానీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఒకరినొకరు తిట్టుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖలిస్థానీ మద్దతుదారులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సం రోజున ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#BreakingNews - Disturbance outside the Consul General of India in Melbourne!
— The Australia Today (@TheAusToday) August 14, 2025
Khalistani 'goons' reportedly created a ruckus, disrupting the premises and raising tensions.
🇮🇳 Indians had gathered to peacefully celebrate India’s 79th Independence Day, but the celebrations were… pic.twitter.com/rnjC0i6TT8
Also Read: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!
అంతేకాదు ఇటీవల మెల్‌బోర్న్‌లోని ఓ హిందూ గుడిపై కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. ఆ గుడి గోడలపై హిట్లర్ చిత్రాన్ని పెట్టారు. దానిపై 'గో హోమ్ బ్రౌన్' రాశారు. మరో విషయం ఏంటంటే అంతకుముందు సిడ్నీలో ఓ భారతీయ విద్యార్థిపై కూడా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అలాగే జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆస్ట్రేలియా అధికారులు సైతం ఈ దాడులను ఖండించారు. ఆస్ట్రేలియాలో భావ ప్రకటన స్వేచ్ఛకు తాము మద్దతిస్తామని.. కానీ హింస, ద్వేషపూరిత ప్రసంగాలను తాము సహించమని తేల్చిచెప్పారు.
మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్‌తో స్నేహ బంధం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందని.. భారత్ సాధించిన విజయాన్ని తాము కూడా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీయులు ఎక్కువగా ఆందోళనలు చేస్తుంటారు. భారతీయులతో గొడవలకు దిగుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అది కూడా స్వాంతత్ర్య దినోత్సవం రోజున జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.