DK Parulkar: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!

1971 యుద్ధంలో వింగ్ కమాండర్‌ పారుల్కర్, పాక్ సైన్యానికి యుద్ధఖైదీగా చిక్కారు. ఆయన ధైర్యం, దేశభక్తి ఏమాత్రం తగ్గలేదు. తన ఇద్దరు సహచరులతో కలిసి జైలు నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం పాక్ రావల్పిడి జైలు నుంచి తప్పించుకున్నారు.

New Update
Wing Commander DK Parulkar

2019లో POKలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన వైమానికి దాడుల గురించి తెలిసిందే. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సందర్భంగా MiG-21 బైసన్ యుద్ద విమాన పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్ సైన్యానికి చిక్కాడు. తర్వాత ఆయన్ని చర్చల్లో భాగంగా పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ విషయం అందరికీ తెలుసు.. గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పారుల్కర్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఆయన ఒకటి కాదు, రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి తప్పించుకు వచ్చారు.

82ఏళ్లలో..

1971 ఇండో, పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు యుద్ధ ఖైదికి చిక్కిన దిలీప్ కమల్కర్ చాలా చాకచక్యంగా పాక్ ఆర్మీ కళ్లు గప్పి తప్పించుకున్నారు. 2025 ఆగస్ట్ 10న గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పారుల్కర్ (రిటైర్డ్) 82ఏళ్లలో కన్నుమూశారు. ఆయన పుణెలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పారుల్కర్ మృతి పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ధైర్యసాహసాలు, దేశం పట్ల చూపిన ప్రేమ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచి ఉంటాయని పేర్కొంది. గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పారుల్కర్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

1971 ఇండో పాక్ వార్

1971 యుద్ధంలో వింగ్ కమాండర్‌గా ఉన్న పారుల్కర్, పాక్ సైన్యానికి యుద్ధఖైదీగా చిక్కారు. అయితే ఆయన ధైర్యం, దేశభక్తి ఏమాత్రం తగ్గలేదు. తన ఇద్దరు సహచరులతో కలిసి జైలు నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం పాక్ రావల్పిడి జైలు నుంచి తప్పించుకున్నారు. రెండు రోజుల తర్వాత గానీ పాకిస్థాన్‌కు ఈ విషయం తెలియలేదు. ఈ సాహసానికి ఆయనకు "విశిష్ట సేన పతకం" లభించింది. పారుల్కర్ ధైర్యసాహసాలు 1971 యుద్ధానికే పరిమితం కాలేదు. 1965లో కూడా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన తన పరాక్రమాన్ని ప్రదర్శించారు. శత్రువుల కాల్పుల్లో ఆయన విమానం దెబ్బతినడమే కాకుండా, కుడి భుజానికి గాయమైంది. విమానం నుంచి దూకేయమని పైలట్ సూచించినప్పటికీ, ఆయన ఏమాత్రం జంకకుండా దెబ్బతిన్న విమానాన్ని సురక్షితంగా బేస్‌కు తీసుకువచ్చారు. ఈ సాహసానికి ఆయనకు "వాయు సేన పతకం" లభించింది.

సొరంగా ద్వారా జైలు నుంచి ఎస్‌కేప్

1963 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన పారుల్కర్, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ సహా అనేక కీలక పదవుల్లో సేవలందించారు. ఆయన జీవితం, దేశభక్తి, అసాధారణ ధైర్యానికి ప్రతీక. భారత వైమానిక దళానికి ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. వింగ్ కమాండర్ దిలీప్ కమలాకర్ పరుల్కర్ ఒకసారి కాదు రెండుసార్లు పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడి నుండి బయలుదేరి తన దేశానికి తిరిగి వచ్చాడు. 8 నెలలు యుద్ధ ఖైదీగా ఉండి తర్వాత, అతను తన ఇద్దరు సహచరులతో కలిసి పాకిస్తాన్‌లోని రావల్పిండి జైలు నుండి విజయవంతంగా తప్పించుకున్నాడు. 1963లో భారత వైమానిక దళంలో చేరిన 2 సంవత్సరాలలోపే, పరుల్కర్ 1965లో పాకిస్తాన్‌పై దాడి చేశాడు. ఆ సమయంలో, పరుల్కర్ వైమానిక దళంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. పంజాబ్‌లోని లూథియానాలోని హల్వారా వైమానిక స్థావరంలో ఆయన నియమితులయ్యారు. సెప్టెంబర్ 1965లో, పరుల్కర్ తన ముగ్గురు సహచరులతో కలిసి పాకిస్తాన్ లోపల సర్గోధ వైమానిక స్థావరంపై దాడి చేశారు.

మరో ఇద్దరు ఆఫీసర్లతో పట్టుబట్ట దిలీప్ పరుల్కర్‌

అయితే, తిరిగి వచ్చేటప్పుడు, పరుల్కర్‌(DK Parulkar) కు పాకిస్తానీ బుల్లెట్ తగిలింది. పాకిస్తాన్ సైన్యం ట్యాంకులపై అమర్చిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ తుపాకుల నుండి వచ్చిన బుల్లెట్ విమానంలోకి దూసుకొచ్చింది. అతని ఎడమ భుజానికి తగిలి, కాక్‌పిట్ నుండి బయటకు వెళ్లింది. కానీ దిలీప్ పరుల్కర్ ధైర్యాన్ని కోల్పోకుండా, ఒక చేత్తో తన ఫైటర్ జెట్ కంట్రోల్ చేస్తూ ఇండియాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ధైర్యసాహసాలకు, మరుసటి సంవత్సరం అతనికి ఎయిర్ ఫోర్స్ మెడల్ కూడా లభించింది. 

1971లో యుద్ధ ఖైదీ

వింగ్ కమాండర్ పారుల్కర్ మరోసారి తన ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. 1971 డిసెంబర్ 10న పారుల్కర్ సుఖోయ్-సాబర్ ఫైటర్ జెట్‌లో తూర్పు పాకిస్తాన్‌లోకి ప్రవేశించి, పాకిస్తాన్ ఆర్మీ ట్యాంకులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కానీ పాక్ ఆర్మీ ఎదురుదాడిలో పారుల్కర్ విమానం దెబ్బతింది. అతను జెట్ నుండి బయటపడి తూర్పు పాకిస్తాన్‌లో యుద్ధ ఖైదీగా చిక్కాడు. అయితే, పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత, 1971 డిసెంబర్ 25న భారతీయ యుద్ధ ఖైదీలు ఒకరినొకరు కలుసుకోవడానికి అనుమతించింది. ఈ టైంలో పారుల్కర్ IAF ఫ్లైట్ లెఫ్టినెంట్ M.S. గ్రేవాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ హరీష్ సింగ్జీలను కలిశాడు. పారుల్కర్, ఇద్దరు IAF అధికారులతో కలిసి, రావల్పిండి జైలు నుండి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశారు. యుద్ధ ఖైదీగా ఎనిమిది నెలల తర్వాత, 1972 ఆగస్టు 12న వింగ్ కమాండర్ డికె పరుల్కర్ తన సహచరులతో కలిసి తన ప్రణాళికను అమలు చేసి, రావల్పిండి జైలు నుండి ఒక సొరంగం ద్వారా తప్పించుకున్నాడు. వారు ముగ్గురూ కలిసి జైలు నుండి బయటికి ఒక సొరంగం నిర్మించారు. దాని ద్వారా వారు జైలు నుండి బయటకు వచ్చారు. జైలు నుండి తప్పించుకున్న తర్వాత, ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వైపు వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుండి 4మైళ్ల దూరంలో ముగ్గురూ ఒక తహసీల్దార్‌కు ఎదురైయ్యారు. తహసీల్దార్ విచారణ సమయంలో వారి పొరపాటు కారణంగా, వారు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఫైసలాబాద్‌లోని లియాల్‌పూర్ జైలులో

ఈసారి ఆయనను రావల్పిండి జైలుకు బదులుగా ఫైసలాబాద్‌లోని లియాల్‌పూర్ జైలులో బంధించారు. అక్కడ 600 మందికి పైగా భారతీయ యుద్ధ ఖైదీలను నిర్బంధించారు. 1972 నవంబర్ 24న పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భుట్టో ప్రకటన తర్వాత వారం రోజులపాటు వింగ్ కమాండర్ డికె పరుల్కర్‌తో పాటు భారతీయ యుద్ధ ఖైదీలందరినీ  విడుదల చేసి అట్టారి-వాఘా సరిహద్దు వద్ద అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు