High Court: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్‌ మిళింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
high court 2  bombay

Mumbai High Court sensational comments in minor girl rape case

High Court: మైనర్ బాలికల శృంగారంపై ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడితో ఇష్టంగా రతిలో పాల్గొనడం తప్పు కాదని చెప్పింది. 2019లో ఓ వ్యక్తిపై పొక్సో చట్టం కింద నమోదైన కేసు విచారణలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన 24 ఏళ్ల యువకుడికి ముంబై హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. బాధితురాలు మైనర్‌ అయినప్పటికీ పరస్పరం ఇష్టంతో గడిపినపుడు నిందితుడికి బెయిల్‌ ఇవ్వొచ్చని న్యాయమూర్తి జస్టిస్‌ మిళింద్‌ స్పష్టం చేశారు. 

అతనితో మూడు రోజులు గడిపిన బాలిక..

ఈ మేరకు 2019లో కేసు నమోదైనపుడు బాధిత బాలిక వయసు 14 ఏళ్లు. ఆ యువకుడికి 19 ఏళ్లు. అయితే వీరిద్దరు ప్రేమలో పడగా మూడు రోజులు ఆ బాలిక అతనితో గడిపింది. ఈ క్రమంలో ఆమె పేరెంట్స్ యువకుడిపై లైంగిక దాడి కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. ఈ కేసు విచారణ శనివారం జరగగా.. మైనర్ బాలికే అయినా అన్నీ తెలిసి చేసినపుడు నేరంగా పరిగణించలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు!

ఇదిలా ఉంటే.. 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే కేసు అంతా నడిచింది. అందులో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో బాధితురాలు తాను అంతకు ముందు చెప్పిన వాటిల్లో తరువాత తానే కొన్నింటిని తిరస్కరించింది. దీంతో  సాక్షి సాక్ష్యంతో కొంత భాగం ప్రాసిక్యూషన్ కేసుతో సరిపోలినప్పటికీ, నేరాన్ని నిర్ణయించడంలో సాక్షి మొత్తం విశ్వసనీయత చాలా కీలకమని జస్టిస్ సనప్ హైలెట్ చేశారు. లోపభూయిష్ట దర్యాప్తులు లేదా బలవంతపు సాక్ష్యాల ఆధారంగా తప్పుడు శిక్షలు పడకుండా కోర్టులు నిర్ధారించుకోవాలని సూచించారు. అందుకే ఎనిమిది మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు ప్రకటించింది. 

ఇది కూడా చదవండి: Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు