Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు?

మహాశివరాత్రి రోజున లింగోధ్బవ కాలం  చాలా ముఖ్యమైనది. అన్ని శివాలయాల్లో ఆరోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అసలు లింగోధ్బవ కాలం అంటే ఏమిటి? లింగోధ్బవ కాలం వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

author-image
By Archana
New Update
Maha Shivratri 2025

Maha Shivratri 2025

Maha Shivratri 2025: శివ భక్తులకు, హిందువులకు అత్యంత ప్రీతికరమైన, శ్రేష్ఠమైన పర్వదినం మహాశివరాత్రి. హిందూ శాస్త్రాల ప్రకారం మాఘమాస కృష్ణ పక్షం చతుర్థశి తిథిన మహాశివరాత్రి వస్తుంది. ఈ ఏడాది నేడు అనగా 26-02-2025 బుధవారం నాడు మహాశివరాత్రి జరుపుకోనున్నారు. అయితే మహాశివరాత్రి రోజున లింగోధ్బవ కాలం  చాలా ముఖ్యమైనది. అన్ని శివాలయాల్లో ఆరోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాలను దర్శించుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. అసలు లింగోధ్బవ కాలం అంటే ఏమిటి? లింగోధ్బవ కాలం వెనుక ఉన్న కథేంటి?  ప్రత్యేకత ఏంటి? లింగోద్భవ సమయంలో శివపూజ ఎందుకు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

లింగోద్భవ కాలం అంటే ఏమిటి? 

 శివుడు స్వయంగా లింగ రూపంలో అవతరించిన సందర్భాన్ని లింగోద్భవ కాలం అంటారు. స్కాంద పురాణ గ్రంథాలు ప్రకారం మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి అర్థరాత్రివేళ లింగోద్భవం జరిగినట్లు చెబుతారు. అదే రోజును మహా శివరాత్రి పర్వదినంగా పాటించడం సంప్రదాయం. 

లింగోద్భవం వెనక కథ

పురాణాల ప్రకారం.. ఒక మహా ప్రళయం తర్వాత విష్ణువు, బ్రహ్మ దేవుడు మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్పో తేల్చుకునే వరకు వెళ్ళింది. ఏకంగా యుద్దానికి దారి తీసింది. ఇరువురు ఒకరి పై ఒకరు పాసుపత్రాలను ప్రయోగించుకున్నారు. దీంతో పరమశివుడు  మరోసారి ప్రళయం రాకూడదని, వీరిద్దరి అహంకారాన్ని పోగొట్టడానికి  రెండు అస్త్రాల మధ్య ఆది, మూలం తెలియరాని విధంగా మహాగ్నిస్తంభగా  ఆవిర్భవించాడు. అందులో నుంచి  అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు. అదే శివలింగం. ఇది మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది. కావున ఆ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. 

Also Read :  మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే

ఆ తర్వాత మహా శివుడు మహాగ్నిస్తంభం ఆది, అంతాలను కనుగొనమని బ్రహ్మా, విష్ణులకు సవాలు విసురుతాడు.  జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని తెలుసుకునేందుకు వరాహ రూపంలో విష్ణుమూర్తి,   ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు హంస రూపంలో బ్రహ్మ దేవుడు వెళ్తారు. కానీ కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు. అప్పుడు శివుడు తన నిజస్వరూపంలో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

లింగోద్భవ సమయం ప్రాముఖ్యత 

లింగోద్భవ సమయమందు మారేడు దళములతో శివుడిని దర్శించుకోవడం ద్వారా 76 జన్మలలో చేసిన పాపములు నశిస్తాయని సాక్షాత్తు ఆ మహేశ్వరుడే పార్వతికి చెప్పినట్లు పురాణాలలో పేర్కొన్నారు. అలాగే  లింగోద్భవ కాల సమయంలో పరమశివుడికి జలం, భస్మము సమర్పించడం శుభకరం. 

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

#telugu-news #life-style #MAHA SHIVA RATRI 2025 #Lingodbhava kalam
Advertisment
Advertisment
తాజా కథనాలు