ముంబయి కోర్టు సంచలన తీర్పు.. 8 మంది పాకిస్థానీయులకు 20 ఏళ్ల జైలుశిక్ష..

ముంబయి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రూ.7 కోట్ల విలువైన 232 కిలోల డ్రగ్స్ కేసులో 8 మంది పాకిస్థాన్ జాతీయులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది.

New Update
Court

Court

ముంబయి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎనిమిది మంది పాకిస్థాన్ జాతీయులకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది. 2015లో రూ.7 కోట్ల విలువైన 232 కిలోల డ్రగ్స్ కేసులో 8 మందిని దోషులగా నిర్ధారించిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2015లో గుజరాత్‌ తీరంలో హెరాయిన్‌ తరిస్తున్న ఓ బోటును భారత కోస్టుగార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటులో 11 డ్రమ్ములు, గోధుమ వర్ణంలోని పొడితో ఉన్న 20 ప్లాస్టిక్‌ పౌచ్‌లు గుర్తించారు. ఆ ప్యాకెట్లలో ఉన్న పదార్థాన్ని పరిశీలించగా అది హెరాయిన్ అని తేలింది. దీంతో కోస్ట్‌గార్డ్ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అలాగే మూడు శాటిలైట్‌ ఫొన్‌లు జీపీఎస్‌ నావిగేషన్ చార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు.   

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆ తర్వాత కోస్ట్‌గార్డు అధికారులు నిందితులను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కేసులో నిందితులకు గరిష్ఠంగా శిక్ష విధించాలని.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేశ్ పుంజ్వానీ కోర్టును అభ్యర్థించారు. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక కావాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. ఎనిమిది మంది దోషులకు శిక్ష ఖరారు చేసింది.

Also Read: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

Also Read: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు