భారత రక్షణ దళం మరింత విస్తరించనుంది. సమీకృత థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కొత్త సంవత్సరం వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కీలక ప్రాజెక్టులు, సంస్కరణలు, ఇతర అంశాల పురోగతికి సంబంధించి చర్చలు జరిపారు. ఇండియన్ ఆర్మీని.. వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించగల టెక్ ఫోర్స్‌గా మార్చేందుకు కృషి చేయనున్నారు. Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! దేశంలో కృత్రిమ మేధ(AI), అంతరిక్షం, సైబర్, మెషిన్ లెర్నింగ్, హైపర్ సోనిక్ రోబోటిక్స్ రంగాలపై సంస్కరణలు చేయాలని ఈ సమావేశంలో రక్షణశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ల అవసరాలకు తగ్గట్లు దళాల మధ్య సమన్వయం కుదిరేలా, మరింత సహకారం పెంచేలా టార్గెట్ పెట్టుకుంది. అవసరాలకు తగ్గట్లు వీటిని సమకూర్చడం, అభివృద్ధి చేసేదుకు ఆయుధాల కొనుగోళ్ల విధానాన్ని సరళీకరించాలని నిర్ణయించింది. Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. ఈ ఏడాది సాయుధ దళాలకు కీలకమైన ముందడుగని అభివర్ణించారు. దేశ రక్షణ సన్నద్ధతలో ఈ చర్యలు ఊహించని ముందడుగుకు పునాదిగా మారుతాయని పేర్కొన్నారు. Ministry of Defence declares 2025 as "Year of Reforms"⁰"Year of Reforms" will be a momentous step in modernisation journey of the Armed Forces: Raksha Mantri Shri @rajnathsingh ⁰⁰“It will lay the foundation for unprecedented advancements in defence preparedness, ensuring… — रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) January 1, 2025 Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు! Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు!