/rtv/media/media_files/2025/03/07/jx8pE61H9brqZHfoj9yD.jpg)
Tahawwur Rana
Tahawwur Rana: ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు తహవూర్ రాణా మరికాసేపట్లో భారత్ కు రానున్నారు. ఒక ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని భారతీయ అధికారుల బృందం ఇండియాకు పయనమైంది. తీహార్ జైలులో ఉంచనున్నట్లు తెలుస్తుండగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్..
ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు తహవూర్ రాణా.. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. కానీ తనను భారత్ పంపించొద్దు అంటూ అమెరికా ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారిగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు తహవూర్ రాణా.
Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు
అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. రాణా పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా నిన్న మరో న్యాయస్థానం కూడా అతని పిటిషన్ ను తిరస్కరించింది. వీటన్నిటితో పాటూ రాణా అప్పగింతపై అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు వెళ్ళినప్పుడు 26/11 ముంబై ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తామని మాటిచ్చారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..
mumbai | tihar-jail | telugu-news | today telugu news
Follow Us