Tamannaah: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన సినీ జీవితంలో 20 ఏళ్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. తన లైఫ్ లో జరిగిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది.

New Update
Tamannaah

Tamannaah

Tamannaah: తమన్నా తన 20 ఏళ్లు సినీ ప్రయాణానికి  పూర్తి చేసుకొని  – ‘ఓదెల 2’(Odela 2)తో మరో సంచలన హిట్ అందుకోవడానికి సిద్ధమైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన సినీ జీవితంలో 20 ఏళ్ల మైలు రాయిని చేరుకుంది. చిన్న వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన తమన్నా, ఇప్పటికీ పాప్‌పులారిటీ తగ్గకుండా కొనసాగుతుండటం విశేషం. తాజాగా తమన్నా కెరీర్‌కు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది.

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

తమిళ చిత్రసీమలో నం.1 హీరోయిన్

"ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఇది ఒక గొప్ప ఫీల్. కెరీర్ ప్రారంభంలో ఇంతదూరం వస్తానని అనుకోలేదు. కానీ నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు ఓ ప్రత్యేక సంఘటన జరిగింది అది నేను ఎప్పటికీ మరిచిపోలేను. నా జన్మదిన వేడుక సందర్భంగా ఇంట్లోనే ఉండగా ఓ పత్రికలో తమిళ చిత్రసీమలో నం.1 హీరోయిన్ అనే శీర్షికతో వచ్చిన కథనం చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. నిజంగా కళ్ళలో  కన్నీళ్లు ఆపలేకపోయాను. అప్పటి నుంచే నటనను ఒక బాధ్యతగా తీసుకున్నాను. అదే నా లైఫ్ లో మోస్ట్ మిమోరబుల్ మూమెంట్," అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఇక తమిళం, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తమన్నా తాజా చిత్రం ‘ఓదెల 2’ (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో కనిపించనుంది. మూవీ పై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, తమన్నా కెరీర్‌లో మరో హిట్ అవుతుందా అన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర అంశంగా మారింది.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు