Tahawwur Rana: తీహార్ జైలుకు తహవూర్ రాణా.. పటిష్ట భద్రత ఏర్పాటు!
ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు తహవూర్ రాణా మరికాసేపట్లో భారత్ కు రానున్నారు. ఒక ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని భారతీయ అధికారుల బృందం ఇండియాకు పయనమైంది. అతన్ని తీహార్ జైలులో ఉంచనున్నట్లు తెలుస్తుండగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.