/rtv/media/media_files/2025/03/04/3wmqgT7dhrzPwnNaZUjA.jpg)
xi jinping and Trump
చైనాపై ట్రంప్ టారీఫ్ లతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు. తమ హెచ్చరికలను చైనా పట్టించుకోలేదని ట్రంప్ ఆ దేశంపై ఏకంగా 104శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఖంగుతిన్నాయి. చైనా అయితే ఆగ్రహంతో పొగలు కక్కుతోంది. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడింది. దీనిపై చివర వరకు తాము పోరాడతామని..ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించామని చెబుతోంది. అలాగే అమెరికాకు తగిన విధంగా బదులు ఇస్తామని..అందుకు తగ్గ ఆయుధాలన్ని మా దగ్గర ఉన్నాయని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక పరంగా బలవంతపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..
రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రంప్ మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
today-latest-news-in-telugu | china | donald trump tariffs
Also Read: USA: కలలు కల్లలుగానే మిగిలిపోతాయా..ఆందోళనలో అమెరికా విద్యార్థులు