Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

మహారాష్ట్రలో ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించడంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. ముంబై- పుణె మార్గంలో వెళ్తున్న ‘ఈ-శివనేరీ’ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

New Update
maharasrta

MSRTC dismisses bus driver for watching cricket match on mobile phone

Viral video: మహారాష్ట్రలో ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించడంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. ముంబై- పుణె మార్గంలో వెళ్తున్న ‘ఈ-శివనేరీ’ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

బస్సు ఓనర్ కు రూ.5,000 జరిమానా..

ఈ మేరకు డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయిక్‌కు పంపించాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రవాణాశాఖ మంత్రికీ ట్యాగ్‌ చేశాడు. దీంతో ఈ ఇష్యూపై వెంటనే స్పందించిన మంత్రి సర్నాయిక్‌.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో సదరు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించడంతోపాటు ప్రైవేటు బస్సు ఓనర్ కు రూ.5,000 జరిమానా విధించారు.

Also Read: Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?

ఇక మంత్రి సర్నాయిక్‌ ఈ అంశపై మాట్లాడుతూ..‘ముంబై- పుణె మార్గంలో ప్రమాద రహిత సర్వీసుగా ‘ఈ-శివనేరీ’కి మంచి పేరుంది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలుంటాయి. మహారాష్ట్ర ఆర్టీసీ కింద పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలు తమ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలి. ఆటో, టాక్సీ డ్రైవర్ల విషయంలోనూ ఫోన్‌ వాడకంపై ఫిర్యాదులున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెడతాం’ అని వివరణ ఇచ్చారు. 

Also Read: TG Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య.. వేటాడి వెంటాడి గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

maharastra | bus-driver | telugu-news | today telugu news | latest-telugu-news | rtv telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు