TG Crime
TG Crime: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో వ్యక్తిని ప్రత్యర్థులు ఘోరంగా గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. శివగంగా కాలనీలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. భరత్‌నగర్‌కు చెందిన బొడ్డు మహేష్‌ను వెంటాడి, వేటాడి గొడ్డళ్లతో అతి దారుణంగా ప్రత్యర్థులు నరికి చంపారు. మొదటగా మహేష్‌ను కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత గొడ్డళ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అతి దారుణంగా హతమార్చిన ప్రత్యర్థులు:
గతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్లీనిక్‌లో మృతుడు మహేష్ ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి జైలుకు వెళ్లాడు. ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. సమాచారం అందుకున్న ప్రత్యర్థులు మహేష్‌ను హతమార్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అర్థరాత్రి హతమార్చారు.
ఇది కూడా చదవండి: లంచ్ బాక్స్‌లో ఏం పెట్టినా పిల్లలు తినడం లేదా.. ఇవి చేసిపెట్టండి, వద్దన్నా తింటారు
మహేష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదలగా.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఇది కూడా చదవండి: యూరిక్ యాసిడ్ పెరిగిందా..టాబ్లెట్స్‌కి బదులు ఇవి తీసుకోండి
(ts-crime | ts-crime-news)