Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?

నాని సొంత బ్యానర్‌లో విడుదలైన "కోర్ట్" మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని హిట్ సాంగ్ "ప్రేమలో తప్పు లేదు ప్రేమలో" ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుదలై, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

New Update
Court Premalo Song

Court Premalo Song

Court Premalo Song: హీరో నాని(Nani) సొంత బ్యానర్ నుండి విడుదలైన "కోర్ట్" మూవీ నుండి "ప్రేమలో తప్పు లేదు ప్రేమలో" పాట ఫుల్ వీడియో సాంగ్ ఇటీవల విడుదలైంది. "కోర్ట్" రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతుండగా థియేటర్ల వద్ద సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజే రూ.8 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. ఐదు రోజులకుగాను మొత్తం రూ.33.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Also Read: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!

రామ్ జగదీశ్ డైరెక్టన్ లో రూపొందిన ఈ మూవీలో  ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. మంగపతిగా శివాజీ నట విశ్వరూపం చూపించాడు. ఇంతటి ఘన విజయాన్ని నాని ముందే ఊహించాడు, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో  ఒకవేళ కోర్ట్ మూవీ హిట్ కాకపోతే, తన తదుపరి "హిట్ 3" సినిమాను చూడొద్దని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..

తెలుగు సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాలలో ఈ సినిమా టాప్ లో నిలిచింది. నిర్మాత నానికి, డిస్ట్రిబ్యూటర్లకు సైతం మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ బడ్జెట్ కంటే దాదాపు మూడు రెట్లు అధిక వసూళ్లు సాధించి బంపర్ హిట్ గా నిలిచింది.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

"ప్రేమలో తప్పు లేదు ప్రేమలో..."

ముఖ్యంగా ఈ మూవీ లో పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. "ప్రేమలో తప్పు లేదు ప్రేమలో" అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటను  రీల్స్ లో, ప్రొమోషన్స్ లో  శ్రీదేవి, హర్ష్ రోషన్ తో స్టేజి పై స్టెప్పులు వేయించడంతో, చాలా మంది ప్లే లిస్ట్ లో ఈ పాట యాడ్ అయిపోయింది. , సక్సెస్ మీట్ లో నాని తో సహా ప్రియదర్శి కూడా ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా ఈ పాటకు చిందులేశారు. ఇంత పాపులర్ అయిన ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు