Parliament Sessions: పార్లమెంట్‌లో చిన్న పిల్లల్లా MPలు.. వీడియోలు వైరల్

పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు సీటు కోసం పోటీపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి సోమవారం ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడారు. ఆయన వెనుక సీట్లో కూర్చుంటే టీవీల్లో కనిసిస్తామని కొందరు ఎంపీలు గొడవపడ్డారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

New Update
parliament seat MPs

పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు వేడీవాడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం జరిగిన పార్లమెంట్‌ చర్చల్లో ఓ హస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. ఎంపీలు సీట్ల కోసం పోటిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరైనా గెలవకుముందు ఎన్నికల్లో నిలబడేందుకు సీట్ల కోసం పోటీపడుతుంటారు. కానీ ఇక్కడ ఎంపీలుగా గెలిచి పార్లమెంట్‌కు వచ్చాక కూర్చొడాని సీటు కోసం ఆరాపటడ్డారు. వారికి ఈ తిప్పల అంతా ఎందుకంటే టీవీల్లో కనిపించేందుకు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వారి గురించి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సోమవారం రాత్రి పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఆ సందర్భంలో సాధారణంగా కెమెరాలు ఆయన వైపు చూపిస్తుంటాయి. 

Also Read :  టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్‌ చాకెట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా కీలక విషయాలు

Parliament Sessions - MP's Clashes

అయితే ఆయన వెనుక ఉంటే టీవీల్లో కనిపిస్తామని కొందరు ఎంపీలు తారసపడ్డారు. ఎంపీ తేజస్వీ సూర్య వెనుక కూర్చునేందుకు ఓ ఎంపీ రాగా ఆయన పోటీగా మరో ఇద్దరు ఎంపీలు అక్కడి వచ్చారు. ఆ సన్నీవేశం స్పష్టంగా టీవీల్లో కనిపించింది. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వాటిని చూసి నవ్వుకుంటున్నారు. ప్రజాప్రతినిధులమని మరిచి ఆటో, బస్‌లో సీట్ల కోసం సామాన్య ప్రజలు గొడవపడినట్లు చేస్తున్నరని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలూ టీవీలో కనిపించడానికి పోటీ పడుతున్నారని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. 

పార్లమెంట్‌లోక్ సభలో సోమవారం ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి గురించి చర్చ జరిగింది. కేంద్ర ప్రభత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నలతో ముంచెత్తాయి. ఎంపీ తేజస్వీ యాదవ్ పార్లమెంట్‌లో సోమవారం పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల గురించి మాట్లాడారు. 

Also Read :  22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. వాళ్లు ఎవరో తెలుసా?

latest-telugu-news | Parliament Monsoon Sessions | viral news telugu | telugu-news | Pahalgam attack

Advertisment
తాజా కథనాలు