/rtv/media/media_files/2025/06/21/nitish-kumar-increases-pension-amount-from-400-to-1100-rupees-2025-06-21-14-39-36.jpg)
Nitish Kumar Increases Pension Amount From 400 to 1100 rupees
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికార, విపక్ష పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ డబ్బులను పెంచారు. ప్రస్తుతం ఈ పింఛన్ రూ.400 వస్తుండటంతో దాన్ని రూ.1100లకు పెంచుతూ నిర్ణయించారు.
Also Read: ఎయిరిండియా నుంచి వాళ్లని తొలగించండి.. DGCA సంచలన ఆదేశాలు
Nitish Kumar Increases Pension Amount
జులై 1 నుంచి ఈ పింఛన్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల కోటి మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందనున్నాయి. దీనిపై సీఎం ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. '' వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్‌ను మా ప్రభుత్వం ఇకనుంచి రూ.400 లు కాకుండా రూ.1100 ఇవ్వనుంది. జులై 1 నుంచి ఈ పింఛన్‌ను లబ్ధిదారులకు అందజేయనున్నాం. జులై 10 వరకు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం.
Also Read: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా!
సమాజంలో వృద్ధులు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఆ మార్గం వైపే మేము కృషి చేస్తున్నామని నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ జేడీయూ, ఎన్డీయే. ఆర్జేడీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నితీశ్ కుమార్ తాజాగా పింఛన్ డబ్బులు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read : దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త,మామలు !
मुझे यह बताते हुए खुशी हो रही है कि सामाजिक सुरक्षा पेंशन योजना के तहत सभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को अब हर महीने 400 रु॰ की जगह 1100 रु॰ पेंशन मिलेगी। सभी लाभार्थियों को जुलाई महीने से पेंशन बढ़ी हुई दर पर मिलेगी। सभी लाभार्थियों के खाते में यह राशि महीने की 10…
— Nitish Kumar (@NitishKumar) June 21, 2025
Also Read : ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో వాపు ఉన్నట్లే.. అప్రమత్తంగా ఉండండి
telugu-news | rtv-news | national-news | nitish-kumar | bihar-assembly-elections | pension