/rtv/media/media_files/2025/07/17/ap-road-accident-2025-07-17-07-16-55.jpg)
AP Road Accident
AP Road Accident: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం రెండు బైకుల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్పాట్‌లోనే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ములకలూరు గ్రామం సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌పై ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చి వచ్చిన టిప్పర్ లారీ ఈ బైకులను బలంగా ఢీకొట్టింది.
Also Read : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
ఇద్దరు మృతి..
ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకులు వివరాలను పోలీసులు నిర్ధారించగా.. వారిని సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన రాకేష్, జానీగా గుర్తించారు. ఇద్దరు స్నేహితులు ఒక్కసారి మృతి చెదంటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు వెంటనే 108 ద్వారా సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను విచారిస్తున్నారు. టిప్పర్ వేగంగా ప్రయాణించడం వల్లే ఈ దారుణం ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకుల మృతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరున్నారు. అక్కడ ఒక్కసారిగా వారి చూసి గుండెలు పగిలేలా రోదించారు. చిన్న వయస్సులోనే తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన వారి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం, డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల ఈ ప్రమాదాలు అధికంగా పెరుగుతుంది. చిన్న నిర్లక్ష్యం వ్యక్తి జీవితాన్ని ముగిస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేయాలని ముఖ్య సూచనలు ప్రభుత్వం చెబుతూనే ఉంటుంది. డ్రైవింగ్ సమయంలో వేగ పరిమితిని తప్పనిసరిగా పాటించాలి. ఫోన్ ఉపయోగిస్తూ, మద్యం సేవించి వాహనం నడప రాదు, సడెన్ బ్రేకింగ్‌కి ముందు వెనుక వాహనాల దూరాన్ని పాటించటం, బైక్ వాహన దారులు, ప్రయాణికులు హెల్మెట్ ధరించటం, స్కూల్స్, ఆస్పత్రులు, మలుపుల దగ్గర నెమ్మదిగా నడిపించాలి, రోడ్‌పై గుంతలు, నీరు ఉంటే వాహన వేగాన్ని తగ్గించటంతోపాటు టైర్లు, బ్రేకులు,సిగ్నల్స్, హెడ్‌లైట్లు, ఇతర రూల్స్ పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.
( AP Crime | ap crime latest updates | ap-crime-news | Latest News | telugu-news )
Also Read : భార్య, అత్త వేధింపులతో మరో నిండు ప్రాణం బలి
latest-telugu-news | andhra-pradesh-crime-reports | road accident