/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-2025-07-28-18-16-48.jpg)
Srishti Test Tube Center
TG Crime: ధనదాహం ఎంత దుర్మార్గానికి ఒడిగడుతుందో హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం చూస్తే తెలుస్తోంది. వారి పెడ పోకడల వల్ల రెండు నెలల పసికందు అనాథగా మారింది. తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డ నగరంలోని శిశు విహార్‌లో ఆశ్రయం పొందుతోంది. పేదరికం తమ బిడ్డను అమ్ముకునేలా చేస్తే ఆ బిడ్డలను పిల్లలు లేని దంపతులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ధనదాహం మానవ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకరికి కడుపు కోతను మిగిలిస్తుంటే మరొకరికి కన్నప్రేమ అనుభూతిని పొందే అవకాశం లేకుండా చేస్తోంది. సరోగసీ సంతానం పేరుతో నమ్మబలుకుతూ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో జరుగుతున్న మోసం మానవత్వానికే మాయని మచ్చగా మారుతోంది.
రెండు నెలల శిశువు అనాథ..
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ సరోగసీ నాటకం రట్టవ్వడంతో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడితోపాటు చంటిబిడ్డను విక్రయించిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ చంటిబిడ్డను శిశువిహార్‌కు తరలించారు. కాగా శిశువు అసలు తల్లిదండ్రులను గుర్తించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిశువును విక్రయించిన దంపతుల నుంచి, సరోగసీ బిడ్డగా భావించి దంపతుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ఇప్పటికే సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్‌లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అస్సాంకు చెందిన దంపతుల కుమారుడని ప్రాథమికంగా తేలింది. అయితే డీఎన్‌ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అధికారికంగా ధృవీకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. చిన్నారికి డీఎన్‌ఏ పరీక్షలు చేయగా.. అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలింది. అయితే వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారు విడుదలయ్యే వరకు శిశువిహార్ సిబ్బంది సంరక్షణలోనే ఉంటాడు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తే.. అప్పుడు బిడ్డను వారికి అప్పగిస్తారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే.. శిశువిహార్‌లోనే ఉంచి సీఏఆర్ఏ మార్గదర్శకాల ప్రకారం దత్తతకు ఇస్తారు. ప్రస్తుతం బాబు అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌లో సురక్షితంగా ఉన్నాడని.. ఆరోగ్యం కూడా బాగుందని ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్ అక్రమాల కేసులో అరెస్టయిన నిందితుల పోలీస్ కస్టడీ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, జయంత్ కృష్ణ ప్రస్తుతం రిమాండ్‌లో జైలులో ఉన్నారు. సరోగసీ, శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, ఐవీఎఫ్, విక్రయాలు, అనుమతి లేకుండా ఐవీఎఫ్ సెంటర్ నిర్వహణపై విచారణ కొనసాగుతుంది. వారం రోజుల కస్టడీ కోరుతూ నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు 3 రోజుల క్రితం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించనున్నారు. మరోవైపు తమపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొంటూ డాక్టర్ నమ్రత తమ న్యాయవాదుల ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..
( srushti test tube center secunderabad | case against shrishti test tube center in secunderabad Latest News)