/rtv/media/media_files/2025/04/26/9EC4tfTx4w2G4frmcjNv.jpeg)
India-Pakistan War Updates
పాక్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది. త్రివిధ దళాల సైన్యాన్ని సిద్ధం చేసింది. ఫైటర్ జెట్లతో ట్రయల్స్ కూడా వేసింది. మరోవైపు అటువైపు నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. బోర్డర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇలాంటి స్థితిలో మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. రక్షణ సంబంధిత వార్తల కవరేజ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు కేవలం మీడియాకే కాకుండా సోషల్ మీడియా నెటిజన్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాక్ కు వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న ఎటువంటి రక్షణ చర్యలనైనా అత్యుత్సాహంతో చూపించడానికి ప్రయత్నించవద్దని గట్టిగా చెప్పింది.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
దయచేసి అటువంటి ఏవీ వద్దు..
ఈ ఆదేశాలకు సంబంధించి సమాచార, ప్రసార శాఖ తాజాగా ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లు రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ చేపడుతున్న కీలక వ్యూహాలు, సమాచారం శత్రువులకు తెలియకూడదని హెచ్చరించింది. అలా తెలిస్తే ప్రభుత్వానికి, అధికారులకు మరింత సమస్య అయ్యే అవకాశం ఉందని...దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లో అవకాశం తీవ్రంగా ఉంటుందని చెప్పింది.
Ministry of Information and Broadcasting Issues Advisory to Media Channels to Avoid Live Coverage
— Amaravati News24 (@amaravatinews24) April 26, 2025
Of DEFENCE operations and movement of security forces in the interest of national security.#India #AndhraPradesh pic.twitter.com/XPKZj0zr99
today-latest-news-in-telugu | pakistan | war | Social Media
Also Read: KKR VS PBKS: కోలకత్తా, పంజాబ్ మ్యాచ్ రద్దు..వర్షార్పణం