/rtv/media/media_files/2025/04/26/dEITn32e2OdrDTUp74GF.jpg)
KKR VS PBKS Photograph: (KKR VS PBKS)
నిన్న కోలకత్తాలో పడిన వర్షాన్ని ఆపడం ఎవరి వల్లనే కాలేదు. చాలాసేపు వెయిట్ చేసినా ఫలితం లేకపోయింది. భారీ గాలులకు మైదానంలో కవర్లను ఏర్పాటు చేయడం కూడా కష్ట సాధ్యమైంది. తరువాత కూడా ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను క్యాన్సల్ చేశారు. ప్రస్తుతం పంజాబ్ 11 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్ ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికీ రెండు జట్లకూ ఎటువంటి ప్రాబ్లెమ్ లేకపోయినా..ప్లే ఆఫ్స్ స్థానాలను నిర్ణయించినప్పుడు మ్యాచ్ రద్దు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
భారీ స్కోరు కొట్టిన పంజాబ్..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. ఆ తర్వాత రస్సెల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (69) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్ సింగ్ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ (83) ఔట్ అయ్యాడు. అలా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ ఔట్, శ్రేయస్ అయ్యర్ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | KKR VS PBKS