Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.

New Update
Vinay Narwal Haryana

Vinay Narwal Haryana

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన కర్నాల్ నివాసి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ శనివారం (ఏప్రిల్ 26) రూ.50 లక్షల పరిహారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉగ్రవాదుల పిరికి చర్యను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత

ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత, ఏప్రిల్ 22న (మంగళవారం) పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపిన 26 మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నాడు. 26 ఏళ్ల అతను తన భార్య హిమాన్షితో హనీమూన్‌కు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. అతని అంత్యక్రియలు ఏప్రిల్ 23న (బుధవారం) కర్నాల్‌లో జరిగాయి. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేస్తున్నాడు వినయ్ నర్వాల్.

మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం కర్నాల్ చేరుకుని వినయ్ నర్వాల్ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నామని చెప్పిన భూపిందర్ సింగ్ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  

Advertisment
తాజా కథనాలు