New York: న్యూయార్క్‌ లో విమాన ప్రమాదం...!

న్యూయార్క్‌ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు

New Update
plane

plane

న్యూయార్క్‌ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఓ పొలంలో కూలిపోయింది. కొలంబియా కౌంటీ అండర్‌షెరీఫ్‌ జాక్వెలిన్‌ సాల్వటోర్‌  ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read:  South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మృతుల వివరాలను ఆమె వెల్లడించలేదు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. మిత్సిబిషీ ఎమ్‌యూ -2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయల్దేరింది. కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది.

Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

Plane Crash In New York

వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదానికి  గల కారణాల పై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక ఇటీవల న్యూయార్క్‌ లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌ కంపెనీ స్పెయిన్‌ విభాగ అధిపతి ,సీఈఓ అగస్టన్ ఎస్కోబార్‌ తన కుటుంబంతో కలిసి హడ్సన్‌ నది మీదుగా వెళ్తున్న సమయంలో ఆ హెలికాప్టర్‌ నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎస్కోబార్‌ , ఆయన భార్య ముగ్గురు పిల్లలతో సహా హెలికాప్టర్‌ పైలట్ సైతం మృతి చెందారు.

Also Read:US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

america | international news in telugu | latest telugu news updates | latest-telugu-news | telugu-news | newyork | plane-crash | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు