/rtv/media/media_files/2025/11/13/calcutta-high-court-2025-11-13-16-51-54.jpg)
Calcutta High Court Disqualifies TMC's Mukul Roy From Bengal Assembly Under Anti-Defection Law
పశ్చిమ బెంగాల్(west bengal) లో పార్టీ మారిన టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌కు బిగ్ తగిలింది. కోల్‌కతా హైకోర్టు(calcutta-high-court) ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2021లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. అదే ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరారు. దీనిపై బీజేపీ నేత సువెందు అధికారి, మరో బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్.. ముకుల్ రాయ్ పార్టీ మారడంపై హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కోరారు.
Also Read: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్..NAAC ఏం చేసిందంటే?
Calcutta High Court Disqualifies TMC's Mukul Roy From Bengal Assembly
దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు.. ముకుల్ రాయ్‌పై అనర్హత వేటు వేసింది. బీజేపీ టికెట్ నుంచి గెలిచిన ఆయన చట్టవిరుద్ధంగా పార్టీ మారాడంటూ పేర్కొంది. యాంటీ డిఫెక్షన్ చట్టం కింద ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. దేశ చరిత్రలో హైకోర్టు ఎమ్మెల్యేపై అనర్హత వేటు విధించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు ఇచ్చిన తీర్పును అక్కడి బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో సువేందు అధికారి.. ముకుల్ రాయ్ పార్టీ మారినప్పుడు ముందుగా స్పీకర్ బిమాన్ బెనర్జీకి ఫిర్యాదు చేశారు. ముకుల్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: సర్వే సంస్థలని 2సార్లు బురిడీ కొట్టించిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. మరీ ఈసారి!?
కానీ బిమాన్ బెనర్జీ.. సువేందు అధికారి విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ బెనర్జీ స్పదించారు. ఈ అంశాన్ని మేము పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కోర్టు ఆర్డర్‌ను మేము చూడాల్సి ఉందని.. ఆ తర్వాత ఏం చేయాలో అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Follow Us