Power Outage: కరెంట్‌ లేక మూడు దేశాల్లో అల్లకల్లోలం.. రోడ్లపైకి వచ్చిన జనం

స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఏప్రిల్ 28న ఉదయం నుంచి కరెంట్‌ నిలిచిపోయింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. విమానయాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. దాదాపు 5 కోట్ల మంది కరెంట్ కోత ప్రభావానికి గురయ్యారు.

New Update
Power Cut

Major power outage in Spain, Portugal, parts of France,


Power Outage: ప్రస్తుతం ఓ పది నిమిషాలు కరెంట్‌ లేకపోతేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థుతులు వచ్చేశాయి. అయితే ఓ మూడు దేశాల్లో మాత్రం కొన్ని గంటలుగా కరెంట్‌ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఏం జరగుతుందో తెలియక రోడ్లపైకి వచ్చేశారు. విమానయాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.  

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Also Read: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!

ఏప్రిల్ 28న ఉదయం నుంచి ఈ మూడు దేశాల్లో విద్యుత్‌ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఎంతసేపటికీ కరెంట్ రాకపోవడంతో జనాలకు ఏం జరుగుతుందో అర్థం కాకా గందరగోళానికి గురయ్యారు. వీధుల్లోకి వచ్చేశారు. ఈ మూడు దేశాల్లో కలిపి దాదాపు 5 కోట్ల మంది కరెంట్ కోత ప్రభావానికి గురయ్యారు.    

Also Read: తోకముడిచిన పాకిస్థాన్.. ఉగ్రవాదులను తరలిస్తున్న పాక్ సైన్యం..

అయితే కరెంట్‌ ఎందుకు పోయిందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అక్కడి మీడియా తెలిపిన ప్రకారం.. యూరోపియన్ ఎలక్ట్రిక్ గ్రిడ్‌లో టెక్నికల్ సమస్యలు రావడం వల్లే పవర్‌ కట్‌కు కారణమైందని తెలిసింది. అలాగే సౌత్ వెస్ట్ ఫ్రాన్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల హై వోల్టేజ్ పవర్‌ లైన్‌ దెబ్బతినడంతో కరెంట్ పోయినట్లు మరో ప్రచారం నడుస్తోంది . 

 Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

 telugu-news | rtv-news | current 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు