/rtv/media/media_files/2025/01/05/wC0QI0xvf9kSVNf6zJYM.jpg)
Madhavi Latha compliant JC Prabhakar Reddy
నటి మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల కిందట నూతన సంవత్సర వేడుకల కోసం మాధవీలత కామెంట్స్ చేసింది. దీనిపై ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. మాధవీలత ప్రాస్టిట్యూట్ అని కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె మాకి ఫిర్యాదు చేసింది. ఆ పత్రాన్ని శివ బాలాజీకి అందజేసింది.
ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!
ఈ విషయంపై మానవ హక్కుల సంఘానికి, అలాగే పోలీస్‌లకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా మాట్లాడటం దారుణం అని, అందుకే మాకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయంపై మా ట్రెజరర్ శివ బాలాజీకి కాల్ చేస్తే అతను వెంటనే స్పందించారని ఆమె అన్నారు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
వివాదం ఏంటంటే?
తాడిపత్రి జేసీ పార్కులో డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. ఇవి కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు వెళ్లవద్దని, మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత తెలిపారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ మాధవీలతపై కామెంట్స్ చేశారు.
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు
జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలను మాధవీలతతో పాటు బీజేపీ నేతలు తప్పుపట్టారు. జేసీపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడిని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జేసీ తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ కూడా చెప్పారు. కానీ మాధవీలత జేసీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్