/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-3.jpg)
Sheik Hasina: అనూహ్యంగా పదవిని కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షేక్ హసీనా కీలక విషయాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు తన పై జరిగిన హత్యాయత్నాల గురించి ఆమె తెలిపారు.
గతేడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దాదాపు 600 మందికి పైగా మరణించారు. దాంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తన పై హత్యాయత్నం జరిగిందని హసీనా పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను, తన సోదరి రెహానా 20-25 నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత భారత్ చేరుకున్నామన్నారు. అవామీ లీగ్ పార్టీ ఫేస్‌బుక్ ఖాతాలో ఆడియో సందేశంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.
గతంలోనూ పలుమార్లు తన పై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా వెల్లడించారు. 2000 సంవత్సరంలో కోటలీపర బాంబు దాడి నుంచి బయటపడ్డాను. 2004 ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో దాడి జరిగింది. ఇందులో 24 మంది మృతి చెందగా..500 మంది గాయపడ్డారు. ఈ దాడిలో హసీనాకు సైతం గాయాలయ్యాయి.
పదహరేళ్లుగా కొనసాగుతున్న షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమం కారణంగా పడిపోయింది. దీంతో పదవీచ్చుతురాలైన ఆమె...స్వదేశాన్ని వీడి భారత్ కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత స్వదేశంలో ఆమె పై అనేక కేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ గత డిసెంబర్ లో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపింది.అయితే ఈ వ్యవహారం పై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అప్పట్లో ప్రకటించారు.
Also Read: Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!
Also Read: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!