/rtv/media/media_files/2025/07/16/jal-shakti-conference-in-delhi-2025-07-16-19-08-29.jpg)
Jal Shakti Conference in Delhi
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం (జూలై 16) కీలక సమావేశం జరిగింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు కూడా పాల్గాన్నారు.
Key Decision Taken At Jal Shakti Meeting
ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది.. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు..దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుంది. కమిటీలో రాష్ట్ర, కేంద్ర అధికారులు, సాంకేతిక సభ్యులుగా ఉంటారు. 2025, జూలై 21 లోపు ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. అలాగే, గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ఏర్పాటుపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, రిజర్వాయర్ల వద్ద టెలీమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. శ్రీశైలం ప్లంజ్పూల్ను మూసేయాలని కూడా ఈ మీటింగ్లో నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం అవసరమైతే మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read : కింగ్‌డమ్ నుంచి వచ్చేసిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్.. వీడియో చూశారా?
AP CM Chandrababu | cm-revanthreddy | godavari river news today | krishna | godavari | krmb | krmb-project