పెన్నాకు గోదావరి జలాలు.. కృష్ణా మీదుగా అనుసంధానం!
గోదావరి జలాలు పెన్నా నదికి తరలించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కృష్ణానది మీదుగా ఈ జలాలను కలిపే ప్రక్రియపై అధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేయాలని భావిస్తున్నారు.