/rtv/media/media_files/2025/01/23/81gNGup6jevcN7ptRb5B.jpg)
Police Last operation on Maoists
Maoist: మావోయిస్టుల ఏరివేత చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ కగార్' పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యుద్ధం దాదాపుగా సక్సెస్ అయ్యేటట్లు కనిపిస్తోంది. గత రెండు నెలల్లో 200 పైగా మావోయిస్టులు మట్టుబెట్టిన పోలీసులు తాజాగా మావోల ఇలాఖాల్లోకి చొచ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో పలు ప్రాంతాలను ఇప్పటికే వశపరుచుకున్న భద్రతాబలగాలు.. డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఎయిర్ వెహికళ్లతో మావోల కదలికలపై డేగకన్నుతో నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే దశాబ్థాల కాలంగా సేఫ్ జోన్లుగా ఉన్న మావోల ఏరియాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు.
శత్రుదుర్భేధ్యమైన పీఎల్జీఏ ఆవాసం..
ఈ మేరకు అబూజ్మడ్ తరువాత మావోలకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా అభయారణ్యంలోకి భద్రతా బలగాలు ఎంట్రీ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో శత్రుదుర్భేధ్యమైన పీఎల్జీఏ ఆవాసంగా ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అభయారణ్యాన్ని చుట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. మావోయిస్టు కేంద్రకమిటీ, పోలిట్ బ్యూరోకు అబూజ్ మడ్ తర్వాత అంతటి సురక్షితమైన ప్రాంతం ఇంద్రావతి అభయారణ్యమే. కాగా ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ అభయారణ్యంలోని మావోల సురక్షిత స్థావరంలోకి ఆదివారం భధ్రతాబలగాలు అడుగుపెట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు!
మహారాష్ట్ర - ఛత్తీస్ ఘఢ్ బార్డర్ లో డ్రోన్ల సాయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన పోలీసు బలగాలు.. అబూజ్మడ్ అటవీప్రాంతంలోనూ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని దండకారణ్యంలోని మావోల కంచుకోటలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇంద్రావతి పార్క్ ఎన్ కౌంటర్ తరువాత ఘటనా ప్రదేశాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. దీంతో దండకారణ్యంలోని సురక్షిత ప్రాంతాల్లో మావోలు పట్టు కోల్పోతుండగా పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. గత శని, ఆది రెండు రోజులు ఎన్ కౌంటర్లలో 31 మంది మావోల హతమైన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!