Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన

ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు, కాకపోవచ్చని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Donald Trump

Donald Trump

మూడేళ్ల క్రితం ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రంప్‌ కూడా తాను అమెరికా అధ్యక్షడిని అయితే ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపేస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే తాజాగా ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు లేదా కాకపోవచ్చని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. 

Also Read: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్‌ కట్‌.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?

రష్యా ఉక్రెయిన్‌లు ఒప్పందం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చని.. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు, కాకపోవచ్చని ట్రంప్ అన్నారు. అలాగే ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల ఒప్పందంతో పాటు అరుదైన ఖనిజాల వినియోగం గురించి మాట్లాడారు. ఈ పోరాటాన్ని ఆపడం కోసం ప్రయత్నిస్తున్న తన రాయబారి అయిన కీత్‌ కెల్లాగ్‌ను త్వరలోనే కీవ్‌కు పంపించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ వచ్చేవారం జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. 

Also Read: కుంభమేళా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి, లేదంటే మీకు తిప్పటు తప్పవు

ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక జెలెన్‌స్కీ, పుతిన్ శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఒకవేళ రష్యా దీనికి నిరాకరిస్తే ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరించారు. ఇటీవలే తాను పుతిన్‌తో కూడా ఫోన్‌ కాల్‌ ద్వారా మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. యుద్ధం వల్ల అమాయక ప్రజలు మరణించడం ఆపాలని పుతిన్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న సాయానికి 500 మిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదిస్తే ఇందుకు వాళ్లు కూడా అంగీకరించినట్లు చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన ఖనిజాలు అమెరికాకు అందించాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ సరఫరా కూడా చేయాల్సిఉంటంది. ఒకవేళ ఎక్కడైనా ఖనిజాలు లభిస్తే వాటిని అమెరికాకు తిరిగి  ఇవ్వాల్సి ఉంటుంది. 

Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు