కర్ణాటక (Karnataka) లో బీర్ల రుచి మారునున్నట్లు తెలుస్తుంది. వాటి ధరల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకుంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ అన్నారు. Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..! దీంతో ఈ సారి ధరలు పెరిగితే ఏడాది వ్యవధిలో మూడోసారి వినియోగదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం ధరల భారం మోపినట్టవుతుంది.తాజా టిఫికేషన్ ప్రకారం ధరలు అమల్లోకి వస్తే బీర్ల ధరలు ఏకంగా 10-20 శాతం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ధరలు ఇలా పెరిగితే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని, దాని ప్రభావం పర్యాటకంపైనా పడుతుందని బీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి 2023 రాష్ట్ర బడ్జెట్‌లో బీర్ల ధర (Beers Price) లను పది శాతం పెంచడం తో 650 మి.లీ బీర్ సీసా ధర రూ.10-15 వరకు పెరిగింది. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో మరోసారి ధరలు 10 శాతం పెంచడం వల్ల అదే బీర్ సీసా ధర రూ.15 వరకు పెరిగింది. Also Read: Chhattisghar: ఛత్తీస్‌ఘడ్‌లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్ తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ దేశ వ్యాప్తంగా బీర్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందులో కింగ్ ఫిషర్ బీర్ల (King Fisher Beer) కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అత్యధిక మంది ఈ బీర్లనే ఎంచుకుంటారు. టేస్టీ పరంగా కూడా ఈ కింగ్ ఫిషర్ బీరే కింగ్‌లా పనిచేస్తుందని భావించి తెగ తాగేస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ బీర్లకి కొరత ఉంటుంది. ఇక వేసవి కాలం వచ్చిందంటే.. ఈ కంపెనీ బీర్లు దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. మండే ఎండకి.. అలా చిల్డ్ బీర్ వేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లు ఫీలవుతుంటారు. ఇక అందులోనూ కింగ్ ఫిషర్ అయితే అబ్బో రచ్చ రచ్చే. దీంతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌గా కింగ్ ఫిషరేకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ బీర్ తెలంగాణలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అవును ఇది వినడానికి కొంచెం కష్టమే అయినా.. తెలంగాణలో మందు బాబులకు ఇదొక షాకింగ్ విషయమే అని చెప్పాలి. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజస్‌కు కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాల సరఫరాను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది. Also Read: కాల్చారా.. కాల్చుకున్నాడా.. ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి! Also Read: వాళ్లకు మాత్రమే రూ.12 వేలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన