Chhattisghar: ఛత్తీస్‌ఘడ్‌లో ఇంకో దారుణం..జర్నలిస్ట్ ఫ్యామిలీ మర్డర్

ఛత్తీస్‌ఘడ్‌లో జర్నలిస్ట్ ను దారుణంగా చంపిన ఘటన ఇంకా మరువనేలేదు. మళ్ళీ ఇంకో జర్నలిస్ట్‌ ఫ్యామిలీని చంపేశారు. ల్యాండ్‌కు సంబంధించిన కొట్లాటల కారణంగా సంతోష్ కుమార్ అనే మీడియా జర్నలిస్ట్ కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థులు హతమార్చారు. 

New Update
journalist

Journalist Family Murder

అవినీతిని వెలికి తీయడమే పాపం అయిపోయింది. ఆ కారణంగా ఒక జర్నలిస్ట్ అన్యాయంగా బలయిపోయాడు. ఇప్పుడు భూమి తగాదాల కారణంగా మరో జర్నలిస్ట్ చనిపోయాడు. అతనితో పాటూ మొత్తం కుటుంబం అంతా దుండగుల చేతిలో మృతి చెందారు. 

విచక్షణారహితంగా దాడి..

సూరజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ ఓ మీడియా ఛానెల్‎ జర్నలిస్టు. ఇతని కుటుంబానికి  జగన్నాథ్‌పూర్ ప్రాంతంలో కొంత భూమి ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇందులో ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు ఎప్పటి నుంచో సంతోష్ ఫ్యామిలీ మీద పగతో రగిలిపోతున్నారు. నిన్న ఆ వివాదాస్పద భూమి దగ్గరకు సంతోష్ తల్లిదండ్రులు మాఘే తోప్పో (57), బసంతి టోప్పో (55), సోదరుడు నరేష్‌ టోప్పో (30) వెళ్లారు. అదే టైమ్‌కు అక్కడకు వచ్చిన ఆపోజిట్ వర్గం వాళ్ళపై గొడ్డళ్ళు, కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో సంతోష్ తల్లి బసంతి, సోదరుడి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వారు స్పాట్‎లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మాఘేను అంబికాపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంతోష్ మరో సోదరుడు ఉమేష్ మాత్రం తప్పించుకుని వచ్చి అందరికీ విషయం చెప్పాడు. 

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళే లోపు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టినట్లు ప్రతాప్‎పూర్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఏ ల్యాండ్ అయితే వివాదంలో ఉందో దానిలో ప్రత్యర్థులు కోర్టు తీర్పు ఇవ్వకుండా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి సంబంధించి సంతోష్ కుటుంబం అక్కడకు మాట్లాడ్డానికి వెళ్ళింది. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో ఘర్షణ చెలరేగా దాడి జరిగిందని...ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు చెప్పారు. 

 

Also Read: USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్‌ కు బేషరతు విడుదల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు