Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..!

మేష రాశి వారికి ఈ రోజు కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.సింహ రాశి వారికి ఈ రోజు పనుల్లో విజయం సిద్ధిస్తుంది.ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం..

New Update
Horoscope

Horoscope

Horoscope: 

మేష రాశి వారు ఈరోజు మనో ధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరతాయి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

Also Read: Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కలదు.మీదైనా రంగాల్లో అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ది ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

మిథున రాశి వారికి ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని  అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్‌.

కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలున్నాయి.కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి.సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయోద్దు. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి.

సింహ రాశి వారు ఈరోజు స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను అందుకుంటారు. తోటివారి సహాయసహకారాలు ఉంటాయి.బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Also Read:  Rythu Bharosa: వారికే రైతు భరోసా ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

కన్య రాశి వారు ఈరోజు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వివాదస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి.

ఆత్మస్థైర్యంతో ముందుకు..

తుల రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. అయిన వారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను అదుపు చేయాలి.మనసును స్థిరంగా ఉంచుకోవాలి.

వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. మంచి ఫలితాలను పొందగలరు.

ధనస్సు రాశి వారు ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలను మనో ధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి.

మకర రాశి వారు ఈరోజు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్నిఅశ్రద్ద చేయకండి.

కుంభ రాశివారు ఈ రోజు కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి.వృత్తి, వ్యాపార,ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం వస్తుంది.ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగిపోవాలి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది.ఎవరితోనూ వాదనలు చేయరాదు.

మీన రాశి వారికి ఈరోజు అనుకూల సమయం. తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను అందుకుంటారు.ప్రయాణాలు ఫలిస్తాయి.

Also Read: Sankranthi: మొదలైన సంక్రాంతి సందడి.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై రద్దీ..

Also Read: Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Advertisment
తాజా కథనాలు