/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pice-one-2025-07-20-16-50-01.png)
సితార చిన్న వయసు నుంచే తండ్రికి తగ్గ తనయ అన్నట్లుగా ఎదుగుతోంది. మహేష్ బాబు కూతురు అనే గుర్తింపుతోనే ఆగిపోకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకుంటోంది. పలు కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-five-2025-07-20-16-50-01.png)
ఇది మాత్రమే కాదు, సినిమాల్లోనూ మెరిసింది 'సితార'! సర్కారు వారి పాట సినిమాలో "పెన్నీ" అనే సాంగ్ లో తన తండ్రి మహేష్ తో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె డ్యాన్స్ స్టైల్, ఎక్స్ప్రెషన్స్ మహేష్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఫిదా చేశాయి.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-two-2025-07-20-16-50-01.png)
చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో ఒక స్టార్ లా వెలుగుతోంది.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-three-2025-07-20-16-50-01.png)
తరచూ తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను, వీడియోలను, అలాగే తన డాన్స్ వీడియోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-five-2025-07-20-16-50-01.png)
సితార తన ప్రతిభ, వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాను నటించిన మొదటి కమర్షియల్ యాడ్ రెమ్యునరేషన్ అంతా ఛారిటీకి రాసిచ్చేసింది.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-six-2025-07-20-16-50-01.png)
గతేడాది సితార తన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అనాథ పిల్లలకు సైకిళ్లను పంపిణీ చేసింది. అలాగే వారి మధ్యే తన బర్త్ డే వేడుకలను సెలెబ్రేట్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-seven-2025-07-20-16-50-01.png)
అందం, వ్యక్తిత్వం అన్నింటిలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న సితారను ఎప్పటికైనా వెండి తెరపై చూడాలని ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.
/rtv/media/media_files/2025/07/20/hbd-sitara-pic-eight-2025-07-20-16-50-01.png)