Hema Malini: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు

కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని విపక్షాలపై ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

New Update
Hema Malini responds on Maha Kumbh Stampede

Hema Malini responds on Maha Kumbh Stampede


Hema Malini: ఇటీవల ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లోని మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి హేమా మాలిని స్పందించారు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని విపక్షాలపై ఆరోపణలు చేశారు. '' అఖిలేశ్ యాదవ్‌(Akilesh Yadav) అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము కూడా కుంభమేళాను వెళ్లాం. ఎంతోమంది అక్కడికి వస్తున్నారు. 

Also Read: లోక్‌సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసిన ప్రధాని మోదీ..

భక్తులు భారీగా వస్తున్నప్పుడు నిర్వహణ కష్టమైనప్పటికీ కూడా యూపీ ప్రభుత్వం కుంభమేళా కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహిస్తోంది. మౌని అమవాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాలపాలయ్యారు. ఇది అంత పెద్ద ఘటనేం కాదు. దీన్ని పెద్దదిగా చేసి చూపుతున్నారని'' హేమమాలిని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. అంతమంది చనిపోయినా కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.  

Also Read: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

బీజేపీ అసమర్థత వల్లే తొక్కిసలాట...

మరోవైపు సమాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేశ్‌ ఈ ఘటనపై మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ హెమామాలిని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. బీజేపీ ప్రభుత్వ అసమర్థత వల్లే కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని విమర్శించింది. హేమామాలిన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపించింది. 

Also Read: ప్రపంచంలో టాప్‌ 10 శక్తిమంతమైన దేశాల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స్థానమంటే ?

Also Read: చాట్‌ జీపీటీది లెఫ్ట్‌ భావాజాలం: ఎలాన్ మస్క్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు