/rtv/media/media_files/2024/11/01/KcCqWhsASE3FBWpIPAuB.jpg)
ఓపెన్ ఏఐ కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ మరో కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది. వాట్సప్ ద్వారా చాట్ జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను తీసుకొచ్చిన ఆ సంస్థ...తన సేవలను మరింత విస్తృతం చేసింది.
ఇప్పటి వరకుకేవలం టెక్ట్స్ సందేశాలకు మాత్రమే సమాధానాలు ఇస్తూ వస్తున్న చాట్ జీపీటీ..ఇక పై ఆడియో,ఫొటో ఇన్ పుట్స్ కు కూడా సపందించనుంది. కొత్త సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
Also Read: Hema Malini: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు
అంటే, ఇక పై మీరు ఏదైనా ఇమేజ్ ను వాట్సప్ ద్వారా అప్‌లోడ్ చేసి దానికి సంబంధించిన ప్రశ్న అడిగితే చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది. మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే దాన్ని ఓపెన్ ఏఐ సర్వర్లకు పంపించి ప్రాసెసింగ్ చేసి,దాని పై మీకు సమాధానం ఇస్తుంది.అయితే వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేయకుండా ఉండడమే మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
పెద్ద టెక్ట్స్‌ను ఇన్‌పుట్...
ఇదే తరహాలో వాయిస్ ఇన్ పుట్ ను కూడా విశ్లేషించి మీ ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తుంది.అయితే మీరు ఇన్ పుట్ ఏ రూపంలో ఇచ్చినా టెక్ట్స్ రూపంలోనే చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది. పెద్ద టెక్ట్స్‌ను ఇన్‌పుట్ గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
చాట్ జీపీటీ సేవలను పొందడానికి +18002428478 నంబర్ ను ఓపెన్ ఏఐ గతేడాది డిసెంబర్ లో అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ ను కాంటాక్ట్ లో సేవ్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ బదులిస్తుంది. ఇంతకు ముందు చాట్ జీపీటీ వెబ్‌సైట్ ,యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి వచ్చేది.
ఈ సదుపాయంతో వాట్సప్ లోనే ఎంచక్కా వాడుకోవచ్చు.అయితే రోజువారీ వాడుక పై పరిమితి ఉంటుంది.పరిమితి దగ్గర పడ్డాక నోటిఫికేషన్ ద్వారా ఈ సమాచారం అందుతుంది.
Also Read:Bhutan King In Prayagraj: కుంభమేళాలో భూటాన్ దేశ రాజు గంగా హారతి పూజ
Also Read: Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం..