/rtv/media/media_files/2025/02/04/MC2a7IOm3vev567FyCjF.jpg)
R Ashwin praises Varun Chakraborty
R Ashwin: టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై మాజీ క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడంతో ఆకాశానికెత్తేశాడు. చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సూచించాడు. అయితే అంతకంటే ముందు ఇంగ్లాండుతో జరిగే 3 వన్డేల్లోనూ ఆడించాలంటూ కీలక సూచనలు చేశాడు.
For ending the series with an impressive 14 wickets, Varun Chakaravarthy is the Player of the Series 👏
— BCCI (@BCCI) February 2, 2025
Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/tVaMGvFKj3
స్పిన్ బలం పెరుగుతుంది..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అన్ని దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత్ నలుగురు స్పిన్నర్లతో మొత్తం 15 మంది ఆటగాళ్లతో టీమ్ అనౌన్స్ చేసింది. అయితే ఇవి తుది జట్లు కాకపోవడంతో ఫిబ్రవరి 11 వరకు మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో చక్రవర్తిని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లను అశ్విన్ కోరాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో వరుణ్‌కి అవకాశం ఉంటుందని భావిస్తున్నా. ఎందుకంటే అన్ని టీమ్‌లు ప్రొవిజినల్ జట్టునే ప్రకటించాయి కాబట్టి కాబట్టి చక్రవర్తిని తీసుకునే అవకాశం ఉంది.
Thank you!! I am truly humbled by all the wonderful wishes coming in! pic.twitter.com/3MZLMaY5OH
— Ashwin 🇮🇳 (@ashwinravi99)
టీమ్ ఇండియాను పరిశీలిస్తే ఒక పేసర్‌ను తప్పించి వరుణ్‌ని తీసుకుంటే మరింత స్పిన్ బలం పెరుగుతుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడించాలి. డైరెక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. అతను ఇంకా వన్డేలు ఆడలేదు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో చక్రవర్తికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఛాన్స్ ఇవ్వకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కావడం కష్టమే' అంటూ చెప్పుకొచ్చాడు.