/rtv/media/media_files/2025/02/16/g6ZZ23vsqe0xeDuJssr3.jpg)
RJD MLA Syed Ruknuddin
ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేశారని జేడీయూ నేత ఆరోపించారు. అలాగే తనను కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆర్జేడీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కానీ ఈ ఆరోపణలు ఆ ఎమ్మె్ల్యే ఖండించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో అధికార జేడీయూకు చెందిన బైసీ బ్లాక్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెహాన్ ఫజల్.. ఆర్జేడీకి చెందిన బైసి ఎమ్మెల్యే సయ్యద్ రుక్నద్దీన్ అహ్మద్‌పై పలు ఆరోపణలు చేశారు.
Also Read: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!
ఓ దళిత మహిళకు సంబంధించిన భూ వివాదంలో తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్‌పై ఎక్కించుకొని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని చెప్పారు. తాగేందుకు నీళ్లు అడిగితే బలవంతంగా మూత్రం తాగించారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన ఆ జేడీయూ నేత మొహమ్మద్ రెహాన్ ఫజల్ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read: టోల్‌గేట్ వద్ద దారుణం.. ఓ వ్యక్తిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
మరోవైపు పోలీసులు ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్, అతడి ఐదుగురు సోదరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే జేడీయూ నేత ఫజల్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యేకుర్నుద్ధీన్ ఖండించారు. ఈ ఆరోపణలు రాజకీయమని, నిరాధారమైనవని చెప్పారు. తాను కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలాఉండగా.. సయ్యద్ రుక్నుద్దీన్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి ఆర్జేడీలో 2022లో చేరారు.
Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
Also Read: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. వెలుగులోకి సంచలన విషయాలు